ఫేక్ ముఖ్యమంత్రి.. ఫేక్‌ సంతకాలతోనే తనవారిని గెలిపించుకున్నారని  జగన్​ను చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దుర్మార్గంగా సాగుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు ఏకగ్రీవాలు పెరిగాయన్నారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణలకు సంబంధించి ఫోర్జరీ సంతకాల బాగోతం న్యాయస్థానంలోనూ తేలిందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  ఆర్వోలు బాధ్యత వహించి విధుల నుంచి వైదొలగాలని.. ఫోర్జరీ సంతకానికి బాధ్యుడైన అధికారిని వదిలిపెట్టమన్నారు. 


న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ అరాచక చర్యల వల్లే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యాయని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంతలా ఏకగ్రీవాలు కాలేదన్నారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందన్నారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. 


జగన్ రెడ్డిని గట్టిగా దెబ్బకొట్టి మేలుకొల్పేందుకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఆయుధాన్ని ప్రజలు ఉపయోగించాలని చంద్రబాబు కోరారు. ఇలా గెలిపిస్తూ.. పోతే.. వచ్చే రోజుల్లో ఫేక్ ఐడీలు కూడా సృష్టించి ఓటు హక్కును దుర్వినియోగం చేస్తారన్నారు. 


రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలే కుప్పంలోనూ అమలు చేసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పం 14వ వార్డును ఇదే తరహా అక్రమాలతో ఏకగ్రీవం చేశారన్నారు. పులివర్తి నాని, రామానాయుడు గృహనిర్బంధంపై న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు లెక్కచేయట్లేదని చంద్రబాబు ఓ వీడియో ప్రదర్శించారు. 


Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?


Also Read: KCR Vs Shekavat : జల వివాదాల పరిష్కారానికి ఆలస్యం తెలంగాణదే కేంద్రానికి కాదు ! కేసీఆర్‌దంతా డ్రామాగా తేల్చిన షెకావత్ !


Also Read : పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?


Also Read : పంచ్ ప్రభాకర్‌ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?


Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?


Also Read : ఏం కావాలన్నా అడగండి.. బాధితులకు రూ.1000 చొప్పున ఖర్చులకు ఇవ్వండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి