యూట్యూబ్ త్వరలో తన ప్లాట్‌ఫాంలో డిస్‌లైక్‌ల సంఖ్య కనిపించకుండా చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై వివాదాలు తలెత్తుతున్నాయి. వీడియోపై ప్రజల అభిప్రాయాన్ని తెలియకుండా దాచేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే కంటెంట్ క్రియేటర్లకు హెరాస్‌మెంట్ జరగకుండా.. ‘డిస్‌లైక్స్’ దాడి జరగకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని యూట్యూబ్ అంటోంది. 


డిస్‌లైక్ బటన్‌ను పూర్తిగా తొలగించబోవడం లేదని.. వాటి సంఖ్యను మాత్రం కనిపించకుండా చేస్తామని యూట్యూబ్ అంటోంది. అయితే ఈ డిస్‌లైక్‌ల సంఖ్య ఆ యూట్యూబ్ చానెల్ వారికి ప్రైవేట్‌గా కనిపించనుంది. యూట్యూబ్ స్టూడియోలో దీన్ని చెక్ చేసుకోవచ్చు.


కంటెంట్ క్రియేటర్లపై ఈ పబ్లిక్ డిస్‌లైక్ కౌంట్ ఎఫెక్ట్ ప్రత్యక్షంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే వీడియోలు క్లిక్ బెయిట్లా, స్పాం లేదా మిస్‌లీడింగా అనే విషయాలు కూడా డిస్‌లైకుల ద్వారా ఆడియన్స్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


ఈ డిస్‌లైకు దాడుల కారణంగా యూట్యూబ్ ప్రయాణాన్ని ఇటీవలే ప్రారంభించిన చిన్న క్రియేటర్లపై ప్రభావం పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే ఏ డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారో యూట్యూబ్ తెలపలేదు. కొన్ని నెలలపాటు వివిధ రకాల టెస్టులు చేసి, ఆ ఫలితాలపై క్షుణ్ణమైన విశ్లేషణ చేశాకనే ఈ నిర్ణయం తీసుకున్నామని యూట్యూబ్ తెలిపింది.


అయితే ఈ నిర్ణయానికి ప్రజల నుంచి విభిన్నమైన స్పందనలు ఎదురవుతున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థించగా.. మరి కొందరు మాత్రం యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదంటున్నారు. ప్రజల అభిప్రాయం మిగతా వ్యూయర్స్‌కి తెలియకుండా పోతుందని.. దీని వల్ల మిస్ లీడింగ్ థంబ్ నెయిల్స్, హెడ్డింగులు ఎక్కువయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.






















Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి