Somireddy : పవన్ కల్యాణ్ కి టీడీపీ నుంచి ఊహించని మద్దతు లభించింది. ఓవైపు పవన్ ని వైసీపీ మంత్రులు చెడామడా తిడుతుంటే, మరోవైపు టీడీపీ నుంచి మాత్రం ఆయనకు మద్దతుగా మాటలు వినపడుతున్నాయి. పైగా మంత్రులు పవన్ ని టార్గెట్ చేయడం సరికాదంటున్నారు టీడీపీ నేతలు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పవన్ కు మద్దతుగా నిలిచారు. పవన్ ను విమర్శించడం సరికాదంటూ, వైసీపీ నేతలకు సుద్దులు చెబుతున్నారు. 


దమ్ముంటే సమాధానం చెప్పండి


ఏపీలో వైసీపీయేతర ప్రభుత్వం ఏర్పడాలని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు నూటికి నూరుశాతం వాస్తవం అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. స్వాతంత్ర పోరాటం లాంటి మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు నోరు పారేసుకోవడం సరికాదన్నారు సోమిరెడ్డి. పవన్ లేవనెత్తిన అంశాలకు  దమ్ముంటే మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి. సీబీఐ, ఈడీ దాడులకు భయపడి కేంద్రం కాళ్లుపట్టుకోవాల్సిన అగత్యం వైసీపీకి ఉందని చెప్పారాయన. వచ్చే దఫా వైసీపీ అధికారంలోకి రాకపోతే కచ్చితంగా ఆ పార్టీ నాయకులు జైలుకెళ్తారని జోస్యం చెప్పారు సోమిరెడ్డి.


వైసీపీ వ్యతిరేక కూటమి ఖాయమేనా..?


ప్రస్తుతం పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆయన టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్నా.. కలసి పోటీచేస్తామనే మాట ఖాయంగా చెప్పడంలేదు. ఇటీవల మాత్రం వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చబోను అని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే వైసీపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కలసి పనిచేయాలనేది జనసేనాని ఉద్దేశం. సో.. టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ కలసి పనిచేయాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో తనతో కలసి రాకపోతే బీజేపీకి కూడా పవన్ కటీఫ్ చెప్పే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కల్యాణ్ వైసీపీని వ్యతిరేకించే క్రమంలో టీడీపీతో కలసి నడవాలని డిసైడ్ అయ్యారు. అయితే అధికారికంగా ఆ మాట బయటపెట్టడంలేదు. 


పవన్ మాటల్లో తప్పేముంది


ఈలోగా టీడీపీ బయటపడుతోంది. పవన్ కి సపోర్ట్ ఇస్తూ, వైసీపీని ఎండగడుతోంది. పవన్ కల్యాణ్ చెప్పిన మాటల్లో తప్పేముందని అంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ మంత్రులకు దమ్ముంటే పవన్ లేవనెత్తిన అంశాలకు బదులివ్వాలని, అంతేకాని కేవలం విమర్శలు చేయడం, నోరు పారేసుకోవడం సరికాదని అంటున్నారాయన. మొత్తమ్మీద వైసీపీని గద్దె దించేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని హింటిచ్చారు సోమిరెడ్డి. అదే సమయంలో పవన్ పై విమర్శలు చేస్తే, టీడీపీ కూడా చూస్తూ ఊరుకోదని అంటున్నారు. 


Also Read : Payyavula Kesav : రూ.10 వేల కోట్ల విలువైన లేపాక్షి భూములు రూ.500 కోట్లకే, ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం - పయ్యావుల కేశవ్


Also Read : AP Highcourt : అమరావతి తీర్పుపై సుప్రీంకెళ్లబోతున్నాం - హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం !