Payyavula Kesav : వేల కోట్ల ఆస్తులను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి శక్తికి మించి పనిచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 10 వేల ఎకరాలు వైఎస్ హయాంలో సేకరించారని, అందులో 9600 ఎకరాలను కేవలం రు.2.లక్షలకు కట్టబెట్టారన్నారు. ఇప్పటి వరకు ఆ భూమిని కాపాడటానికి గత ప్రభుత్వాలు ప్రయతిస్తే ఇప్పుడు కేవలం రూ.500 కోట్లకు వైసీపీ ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. ఆనాడు వేల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారని కానీ ఏదీ సాధ్యం కాలేదన్నారు. కియా పరిశ్రమ బెంగళూరు విమానాశ్రయానికి 130 కిలోమీటర్లు ఉందని, అయితే అక్కడ భూముల ధర కోటి నుంచి కోటిన్నర పలుకుతున్నాయని పయ్యావుల కేశవ్ అన్నారు. కానీ లేపాక్షి భుములు బెంగళూరు విమానాశ్రయానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని అయినా లేపాక్షి వద్ద తక్కువలో తక్కువ అంటే రూ. కోటికి పైగా ధర ఉంటుందన్నారు. 


రూ. 10 వేల కోట్ల విలువ 


"ఆ భూముల విలువ కనీసం రూ. 10 వేల కోట్లు ఉంటే కేవలం రు. 500 కోట్లకు ప్రైవేటు కంపెనీలు దక్కించుకుంటుంటే  ప్రభుత్వం  ఏం చేస్తోంది. పీఏసీ ఛైర్మన్ గా ప్రభుత్వానికి లేఖ రాస్తే... 2014 నుంచి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పి ఏజీకి లేఖ రాశాం అని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో లేఖ రాస్తే ఏడాది నుంచి సమాధానం లేదు. సలహా కోసం ఏజీకి రాశాం అన్నారు ఇప్పటి వరకు రీప్లే రాలేదు. భూములు వేలంలో పాల్గొన్న కంపెనీలు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారివే. ఏర్తిన్ కంపెనీలో డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు ఉన్నారు.  పీఏసీ ఛైర్మన్ గా నేను ఎన్సీఎన్టీ నుంచి సమాచార తీసుకునే ప్రయత్నం చేశాను.  ఎన్సీఎన్టీ మొదట తిరస్కరిస్తే నెల రోజుల్లో  పై నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎన్సీఎన్టీకి ప్రభుత్వం వెళ్లదు." - పయ్యావుల కేశవ్  


ముఖ్యమంత్రి ఎటు వైపు 


అరబిందో, రాంకీ, ఎర్తిన్ కంపెనీలు వేలంలో పాల్గొంటే ప్రభుత్వం ఎందుకు భూములు కాపాడే ప్రయత్నం చేయలేదని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. టెండర్లు ఎందుకు ఆపడానికి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ సహకారంతో లేపాక్షి భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను చూస్తూ టీడీపీ ఊరుకోదన్నారు. ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి బంధువుల వైపు ఉంటారా? ప్రజల భూములు కాపడతారో? సమాధానం చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు. లేపాక్షి భూములను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. 


Also Read : Undavalli : వాళ్ల భేటీ ఖచ్చితంగా రాజకీయమే - రాజకీయాలు ఎలా మారతాయో చెప్పిన ఉండవల్లి !


Also Read : జనసేనలో కోవర్టులెవరు ? పవన్ వార్నింగ్‌లతో జనసేన నుంచి వెళ్లే వాళ్లు ఎంత మంది ?