Basara IIIT : వివాదాలకు నిలయంగా మారిన బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి బలవన్మరణం  చెందాడు.  ఆత్మహత్య ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇంజనీరింగ్ మొదటి సంత్సరం చదువుతున్న నరేష్ అనే విద్యార్థి హాస్టల్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. హాస్టల్ యాజమాన్యం సమాచారంతో  విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు నిజమాబాద్ జిల్లా డిచ్ పల్లి వాసిగా గుర్తించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సురేష్ విషయంలో ఏమైనా గొడవలు జరిగాయాల లేకపోతే ట్రిపుల్ ఐటీలో ఇటీవల చోటు చేసుకున్న వివాదాలకు ఆత్మహత్యకు సంబంధం ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. 


రెండు రోజుల కిందట గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు విద్యార్థులు


విద్యార్థి సూసైడ్ తో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టూడెంట్ ఉరి వేసుకుని చనిపోయినా అధికారులు కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో క్యాంపస్ లో టెన్షన్ వాతావరణం నెలకోంది. సోమవారమే బాలర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి లభించింది. ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ  పోలీసులకు పట్టుబడ్డారు.  ట్రిపుల్ ఐటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తన హాస్టల్ గదిలో గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. గంజాయితో దొరికిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరిది కరీంనగర్ జిల్లా కాగా.. మరొకరిదిరి  మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా. ఇద్దరు విద్యార్థులపై ఎన్దీపీయే అక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇద్దరు విద్యార్థుల నుంచి 100 గ్రాములకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ - వీడియో రిలీజ్ చేయడమే కారణం !


ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో వరుస వివాదాలు


అదే సమయంలో ఇటీవల వరుసగా వివాదాల చోటు చేసుకుంటున్నాయి. సౌకర్యాలు సరిగ్గా లేవని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చాలా రోజుల పాటు ఈ ఆందోళనలు సాగాయి. అలాగే క్యాంటీన్ విషయంలోనూ.. ఆహారపదార్థాల విషయంలోనూ వివాదాలున్నాయి. తరచుగా ఫుడ్ పాయిజన్ అవుతూ విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇలా ఎన్నో వివాదాస్పద పరిస్థితుల మధ్య బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం.. దుమారం రేపే అవకాశం కనిపిస్తంది. 


బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు వచ్చేయండి - తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు !


భారీ సెక్యూరిటీ ఉన్నా వరుస తప్పిదాలు


బాసర ట్రిపుల్ ఐటీలో డీఎస్పీ, సీఐతో పాటు దాదాపు 20 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అయినప్పటికీ తరచూ క్యాంపస్‌లో వివాదాస్పద అంశాలు వెలుగు చూస్తున్నాయి.దీంతో  ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.  ప్రభుత్వం తక్షణం ట్రిపుల్ ఐటీ గురించి  పూర్తి స్థాయిలో వివరాలు తీసుకుని చ ర్యలు చేపట్టాలని లేకపోతే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.