Sonali Phogat Death:
భాజపా నేత, నటి, టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్(41) గోవాలో గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురి కావటం వల్ల ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. రెండ్రోజుల షూట్ కోసం తన స్టాఫ్‌తో కలిసి గోవా వెళ్లారు సోనాలి. ప్రస్తుతం పోస్ట్‌మార్టం చేస్తున్నారని, పోలీసులు ఆసుపత్రికి వస్తున్నారని అక్కడి మీడియా వెల్లడించింది. హరియాణా లోని అదంపూర్ నియోజకవర్గం నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరపున పోటీ చేశారు సోనాలి ఫోగట్. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ బిష్ణోయ్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కుల్‌దీప్ ఈ మధ్యే కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. హరియాణాలోని ఫతేబాద్ జిల్లాలో భూటాన్ కలాన్ గ్రామంలో జన్మించారు సోనాలి. హిసార్‌కు చెందిన పొలిటీషియన్ సంజయ్ ఫోగట్‌ను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త కూడా గుండెనొప్పితోనే మృతి చెందారు. సోమవారం రాత్రి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ట్విటర్ అకౌంట్ డీపీ కూడా మార్చారు. పలు హరియాణా చిత్రాల్లో, సీరియల్స్‌లో నటించారు సోనాలి. అంతే కాదు. బిగ్‌బాస్-14 షోలోనూ పాల్గొని పాపులర్ అయ్యారు.