నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది వరద బీభత్సం సృష్టించింది. అసలు వరద ముంపు లేని ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. దీంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ ప్రజల్ని మరింత భయపెడుతున్నాయి. ముఖ్యంగా కోవూరు ప్రాంతంలో భయంతో జనం రోడ్లపైకి వచ్చి పరుగులు పెడుతున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని వాటిని నమ్మొద్దంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమశిల జలాశయానికి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టిందని ప్రస్తుతం ప్రాజెక్ట్ వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కోరారు.
Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !
వదంతులు నమ్మొద్దు
నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. వరదల్లో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదల పరిస్థితి తెలుసుకునేందుకు ప్రజలు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కానీ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు కథనాలు కూడా ప్రచారం అవుతున్నాయి. సోమశి ప్రాజెక్టు కట్టతెగిపోయిందని కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్ కట్ట తెగిపోయిందని వరదనీరు ఊళ్లపైకి వస్తుందని, పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాట్సాప్ లో వదంతలు ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ నిజం కాదని పోలీసులు తేల్చారు. వదంతులను నమ్మొద్దని కోరారు. వరదనీరు క్రమంగా తగ్గుతుందని తెలిపారు.
Also Read: శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?
తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
ఈ వదంతులను నమ్మి ఊళ్లలో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి, సామాన్లు తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్లడం మొదలు పెట్టారు. ముఖ్యంగా కోవూరు మండలంలో పుకారు బాగా వ్యాపించింది. నెల్లూరు నగరం కంటే కోవూరు ఈసారి వరదల ధాటికి బాగా దెబ్బతింది. దీంతో కోవూరు మండల ప్రజలు సామాన్లు తీసుకుని, ఊరు వదిలిపెట్టి పరుగులందుకున్నారు. ఈ వార్తలపై సోమశిల ప్రాజెక్ట్ అధికారులు స్పందించారు. వదంతులు నమ్మొద్దని, ధైర్యంగా ఉండాలని అంటూ ప్రజలకు సమాచారం అందించారు. సోమశిల ప్రాజెక్ట్ వద్ద నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని ఎస్సై సుభానీ ఓ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత అనంతసాగరం మండల తహశీల్దార్ కూడా స్పందించారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా దీనిపై స్పందించారు. జాయింట్ కలెక్టర్ హరిందర ప్రసాద్ వాట్సాప్ ప్రచారాన్ని ఖండించారు. ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: మండలిని రద్దు చేయవద్దు ..ప్లీజ్.. ! కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి