నెల్లూరు(Nellore) పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి మేకపాటి గౌతమ్‌ రెడ్డి(Mekapati Goutham Reddy) భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. గౌతమ్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి వస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి(Mekapati Rajamohan Reddy) ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో అధికారిక లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.



గౌతమ్ రెడ్డి మరణాన్ని ఆయన తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి ఆయన తల్లి మణి మంజరి గుండె పగిలేలా రోధించారు. చివరి చూపు చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఆమె రోధనను చూసి అక్కడున్న వారంతా విషాదంలో మునిగిపోయారు. ఏ తల్లికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. అమెరికా నుంచి మంగళవారం రాత్రికి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి అర్జున్ రెడ్డి చేరుకుంటారు. చెన్నై(Chennai) నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు వస్తారు. 


గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు 


హోం మంత్రి మేకతోటి సుచరిత(Mekatoti Sucharita), ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మీ పార్వతి, ఇతర నాయకులు గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. నెల్లూరులోని మేకపాటి నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌతమ్‌రెడ్డి లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌(Minister Anil Kumar Yadav) అన్నారు. చాలా విషయాల్లో వెన్నుతట్టి ప్రోత్సహించే అన్న ఇకలేరని ఆవేదన చెందారు. 



రేపు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్‌ జగన్‌(CM YS Jagan) పాల్గోనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి కడప వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరు జిల్లా ఉదయగిరి(Udayagiri)కి చేరుకోనున్నారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ లో జరిగే అంత్యక్రియల్లో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్‌ తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 


గౌతమ్ రెడ్డి చివరి చూపుకోసం పోటెత్తిన అభిమానులు


మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం నెల్లూరులోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయన చివరి చూపు కోసం తరలివస్తున్నారు. 


Also Read: Mekapati in Dubai Expo: దుబాయ్ పర్యటనలోనే మేకపాటికి గుండెనొప్పి ఉందా? ఆ వీడియోలో ఇబ్బంది పడుతున్న మంత్రి!