బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం కేటాయించే ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చిల నిర్మాణానికి ఇచ్చిన అంశం వివాదాస్పదమవుతోంది. ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించినా స్పందించడం లేదు. దీంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరో లేఖ పంపింది. కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ రమ్య మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక పంపాలని ఆదేశించారు. 


Also Read : ఎంపీ లాడ్స్ నిధులతో చర్చిల నిర్మాణమా ? రఘురామ ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగిన కేంద్రం !


రెండు నెలల కిందటే ఈ అంశంపై కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది. ఎంపీలకు ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40లక్షలకు పైగా నిధుల్ని ఎంపీ నందిగం సురేశ్‌ చర్చిలకు వినియోగించినట్టుగా ఫిర్యాదులు వచ్చాయని తక్షణం వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని ఏపీ సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు లేఖను కూడా రాష్ట్రానికి పంపారు.


Also Read : ఎంపీలకు ఏటా రూ. ఐదు కోట్లు.. మళ్లీ స్కీమ్ ప్రారంభించిన కేంద్రం !


ఎంపీ లాడ్స్ నిధులు నేరుగా ఎంపీ ఖాతాకు జమ కావు. రాష్ట్ర ప్రణాళిక విభాగం తరపున మంజూరు అవుతాయి. ఈ కారమంగా రఘురామ ఫిర్యాదు మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించి రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శికి లేఖ పంపింది. ఎంపీలకు కేటాయించిన నిధులతో బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఖర్చు చేశారన్న  ఫిర్యాదుపై పూర్తి స్థాయి వివరాలు పంపాలని కోరింది. చాలాచోట్ల ఇదే తరహాలో ఖర్చు చేశారని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో  రాష్ట్ర స్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులనూ ఈ అంశంపై వివరణ అడిగింది.  


Also Read : తిరుపతి శ్రీకృష్ణనగర్ లో వింత ఘటనలు... భూమిలోకి కుంగిపోయిన ఇళ్లు... కూల్చేందుకు సిద్ధమైన అధికారులు


ఒక వేళ ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చి నిర్మాణానికి ఉపయోగించకపోతే ఆ ఫిర్యాదు తప్పని వెంటనే అధికారులు పంపేవారు. కానీ ఏ సమాధానం ఇవ్వలేదంటే నిజంగానే ఖర్చు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల్ని మత సంబంధ కార్యక్రమాలకు, మతపరమైన భవనాల నిర్మాణాలకు ఖర్చు చేయడం నిబంధనలకు విరుద్ధం. 


Also Read : మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నాం.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో అనుబంధ అఫిడవిట్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి