తిరుపతి రేణిగుంట వరద ముంపు ప్రాంతాల్లో నాదేండ్ల మనోహర్ పర్యటించారు. వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని..విమర్శించారు. జగన్ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. నాలుగు జిల్లాల్లో వరద అనేక మంది అమాయక ప్రజలను బలి తీసుకుందని.. నాదేండ్ల అన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మొక్కుబడిగా ఏరియల్ సర్వే నిర్వహించి, జిల్లాకు రెండు కోట్లు లెక్కన నిధులను కేటాయించారన్నారు. చేతులు దులుపుకున్నారని, దేశంలో ఇప్పటివరకు ఐటీ ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోం ఉందని.. దాన్ని సీఎం తనకి అపాదించుకున్నారనిఎద్దేవా చేశారు. జనసేన తరఫున ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టామని, మెడికల్ క్యాంపు లు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని చెప్పారు.
ఇటీవల చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో తిరుపతి నగరం జలమయం అయ్యింది. రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు వర్షపు నీటితో మునిగిపోగా.. నగరంలోని వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్దనున్న అండర్ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వర్షపు నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నాలుగైదు రోజుల క్రితం తిరుమలలో భారీ వర్షాలతో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల రెండో కనుమదారిలో హరిణి వద్ద కొండచరియలు పడ్డాయి. పాపవినాశనం దారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసింది. టీటీడీ సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమాఢ వీధులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. కనుమ దారులు, మెట్ల మార్గంలో వరద చేరడంతో ప్రమాదకరంగా మారాయి. రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి సమీపంలో రహదారిపై చెట్టు కూలడంతో జేసీబీలతో తొలగించారు. కొండపై నుంచి రహదారిపైకి మట్టి, రాళ్లు కొట్టుకు వచ్చాయి.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో 13 ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. 10 జేసీబీలతో కొండచరియలు తొలగించారు. నారాయణగిరి అతిథి గృహాలు వద్ద కొండ చరియలు విరిగిపడడంతో మూడు గదులు ధ్వంసమయ్యాయి. భక్తులు గదులలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Also Read: Corona Cases: దేశంలో 543 రోజుల కనిష్ఠానికి రోజువారి కరోనా కేసులు
Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు