ఆంధ్రప్రదేశ్‌లో వరద సృష్టించిన విలయాన్ని రాజ్యసభ దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వర్షాల వల్ల ఏపీలో కొన్ని జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయ్నారు. ఆకస్మికంగా వచ్చిన వరదలతో వేలమంది నిరాశ్రయులయ్యారని భారీ నష్టం సంభవించిందన్నారు. వరదల వల్ల 44 మంది చనిపోయారని.. ఇప్పటికీ 16 మంది ఆచూకీ తెలియలేదని తెలిపారు. 1.85లక్షల హెక్టార్లలో రూ.654 కోట్ల విలువైన పంటలు వరదల పాలయ్యాయని సభ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐపైనా ఆరోపణలు ! హత్య కేసులో సంచలన మలుపులు ఖాయమేనా ?
మొత్తం వరద నష్టం ప్రాథమికంగా రూ.6,054 కోట్లుగా అధికారులు అంచనా వేశారన్నారు. క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సహాయక చర్యలు చేపట్టిందన్నారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందించాలని విజయసాయిరెడ్డి కోరారు.
భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్ కూడా వరదల అంశంపై మాట్లాడారు. అయితే వరద నష్టం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. వర్షాలపై వాతావరణశాఖ ముందే సమాచారం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి వరద పెద్ద ఎత్తున వచ్చిందని నివేదికలు చూపించారు. వేల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. అందుకే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని విమర్శించారు.
Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కూడా వెనక్కి తీసుకోండి... ప్రధానికి ముద్రగడ లేఖ !
కరోనా నియంత్రణకు విపత్తు నిధులన్నీ వాడేసినందున తక్షణం రూ. వెయ్యి కోట్లు సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వెంటనే కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. సీఎంతోనూ సమావేశమయ్యారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం విపత్తు నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది.
Also Read : పయ్యావులపై అనంతపురం అధికారులు ఫైర్.. కారణం ఏంటో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి