ఏటా మే రెండో ఆదివారం ‘మదర్స్ డే’ నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ ఏడాది మే 8న మాతృ దినోత్సవం సందర్భంగా అన్ని రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మదర్స్ డే శుభాకాంక్షలు తమకు తోచినట్లుగా చెబుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మదర్స్ డే సందర్భంగా విషెస్ తెలిపారు. తల్లి ప్రేమ శాశ్వతమైనదని ఒకరు ట్వీట్ చేస్తే, తల్లి తొలి గురువు అని మరొకరు ట్వీట్ చేశారు.


‘తల్లి ప్రేమ శాశ్వతమైనది మరియు దైవంతో సమానమైనంత గొప్పది. నాకు జన్మనివ్వడమే ఆమె ఇచ్చిన అతిపెద్ద కానుక. ఏపీలోని తల్లులందరి సాధికారతకు కృషి చేయడం కోసం నాకు జన్మనిచ్చిన నా తల్లికి ఇంతకుమించి మరో గొప్ప బహుమతి మరొకటి ఉండదని’ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ద్వారా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.






తల్లిని గౌరవించలేనివాడు ఏనాటికీ గొప్పవాడు కాలేడు అని స్వామి వివేకానంద అన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే లోకాన్ని జయించేలా నిన్ను తీర్చిదిద్ది, నీకు సహకరించే తొలి గురువు అమ్మ అని పేర్కొన్నారు. కుటుంబ ప్రగతికి, సమాజ వికాసానికి అహర్నిశలూ శ్రమించే స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.






Also Read: Mothers Day 2022: ‘అమ్మ’కు ఇచ్చిన ఆ మాటే ‘మదర్స్ డే’, మే నెల రెండో ఆదివారమే ఎందుకు? దీని వెనుక అంత కథ ఉందా?


Also Read: మాతృ దినోత్సవం 2022: ఈ అందమైన కోట్స్‌తో ‘అమ్మ’ను అభినందిద్దామిలా!