ఆంధ్రప్రదేశ్ ( Andhra ) ప్రజలకు గుడ్ న్యూస్ . కరెంట్ కోతల నుంచి విముక్తి కలిగిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన పవర్ హాలీడేను ఉపసంహరించుకుంటున్నట్లుగా విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy ) ప్రకటించారు. వాతావరణం చల్లబడటంతో ిద్యుత్ డిమాండ్ తగ్గింది. ఈ కారణంగా  పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసింది.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 186 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ( Power Holiday ) వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. 


పోస్టల్ శాఖలో రూ. కోటి పైగా నిధులు గోల్ మాల్, ప్రధాన సూత్రధారి ఉద్యోగి - ఒక్కరోజులోనే రూ.40 లక్షలు హాంఫట్


పరిశ్రమలు వినియోగించాల్సిన విద్యుత్ ( Power ) కూడా 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని.. ఆహారశుద్ధి, కోల్డ్ స్టోరేజి, ఆక్వా పరిశ్రమలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతి ఇస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్ర అవసరాల ప్రస్తుతం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఆయన చెప్పారు. ఆరు నెలల్లోగా ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా ఏడాదిలో 33 శాతం మేర విద్యుత్ ఆదా అయ్యిందని వివరించారు. ఆ మేరకు డిస్కమ్ తీసుకునే సబ్సిడీ తగ్గిందని చెప్పారు. 


క్విట్ చంద్రబాబు, సేవ్ ఏపీ, పవన్ ఏమైనా జ్యోతిష్యుడా - మంత్రి రోజా సెటైర్లు


ప్రస్తుతం ఏపీలో  ( AP )  వ్యవసాయ సబ్సిడీ 10 వేల కోట్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు.పరిశ్రమలకు మాత్రం ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో నిరంతరాయంగా పరిశ్రమలు నడిచే వీలు ఉంటుంది. పవర్ హాలీ డే వల్ల కంపెనీ నడవడం వల్ల వారికి మేలు జరగనుంది. ఇదివరకు వారానికి ఒకసారి పవర్ హాలీడే ఇచ్చినా.. ఇప్పుడు నిరంతరాయంగా పనిచేయనుంది. దీంతో పరిశ్రమలు యధావిధిగా నడవనున్నాయి. 


నారాయణ పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ - తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దని జగన్ చెప్పారన్న సజ్జల !


కరెంట్ సమస్యలతో ఇటీవలి కాలంలో దేశం మొత్తం సంక్షోభం ఏర్పడింది. బొగ్గు కొరతతో పాటు రకరకాల సమస్యలు రావడంతో.. ఏపీలో కరెంట్ కొరత విపరీతంగా పెరిగింది. ఇప్పుడు వాతావరణం చల్లబడటంతో పరిస్థితి మారింది.