రైతులు వ్యతిరేకిస్తున్న మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు.  ప్రధానమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారని రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి ప్రకటించిన ఇతర కార్యక్రమాలను అభినందించారు. అదే సమయంలో మూడు సాగు చట్టాల్లాగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. అమరావతికి 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులు 700 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో  వారు త్యాగం చేశారన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు 13 జిల్లాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు .


Also Read : మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వెళ్తా.. కుటుంబాన్ని అవమానించారని విలపించిన చంద్రబాబు !


ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని.. రాజధానికి 30 వేల ఎకరాలు అవసరం అని కూడా వ్యాఖ్యానించారని ప్రతిపక్ష నేత గుర్తు చేశారు. స్వయంగా అసెంబ్లీలోనే ఈ ప్రకటన చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. అమరావతి గురించి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు సభ్యులందరూ మద్దతు తెలిపారన్నారు. అంతా చట్టం ప్రకారమే అమరావతికి రైతులు భూములు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. 


Also Read : టీడీపీది హైడ్రామా..చంద్రబాబు కుటుంబాన్ని ఏమీ అనలేదన్న సీఎం జగన్ !


ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా చేసిన తీర్మానానికి మద్దతు తెలిపాయన్నారు. అతి కొద్ది సమయంలోనే అమరావతి రెండు లక్షల కోట్ల సంపదతో కూడిన ఆస్తిగా ప్రభుత్వానికి మారిందన్నారు. అమరావతి పూర్తిగా అభివృద్ధి చెందితే పదమూడుజిల్లాల అభివృద్ధికి కావాల్సిన నిధులన్నింటినీ సమకూర్చి పెడుతుందన్నారు. అలాగే 175 నియోజకవర్గాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 


Also Read: AP Assembly : అసెంబ్లీలో అనుమానాస్పదంగా మార్షల్ తీరు.. అదుపులోకి తీసుకున్న చంద్రబాబు భద్రతా సిబ్బంది !


మూడు సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని.. అదే పద్దతిలో మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా విత్ డ్రా చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులకు ఇలా చేయడం ఎంతో ప్రయోజనం అన్నారు. అమరావతి అనేది రైతులకు మాత్రమే కాదు.. ప్రజలకు కూడా ఆమోదయోగ్యమైన రాజధానిగా స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎంతో సంపద, అవకాశాలు సృష్టించే అమరావతిది అభివృద్ధిలో కీలక పాత్రగా చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి