విశాఖపట్నంలోని హయగ్రీవ ఇన్ఫ్రాస్ట్రక్స్ కంపెనీ అధినేత జగదీశ్వరుడు సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.  ముఖ్యమంత్రి జగన్‌, విజయసాయిరెడ్డి, ధనుంజయరెడ్డి పేరుతో తనను బ్లాక్ మెయిల్ చేసి.. ఆస్తులన్నీ రాయించుకున్నారని  జగదీశ్వరుడు ఆరోపించి.. సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆజ్ఞాతంలోకి వెళ్లారు.  వైఎస్ఆర్‌సీపీ నేత, ప్రస్తుతం విశాఖ స్మార్ట్‌ సిటీ చైర్మన్‌ గా ఉన్న ఆడిటల్ జి. వెంకటేశ్వరరావు అలియాస్ జీవీ తన ఆస్తి మొత్తం కాజేశారని.. తనను రోడ్డున పడేశారని జగదీశ్వరుడు ఆరోపిస్తున్నారు. జీవీ తమ కంపెనీకి 2004 నుంచి ఆడిటర్‌గా పనిచేస్తున్నారని... కొన్ని వ్యాపారాల్లో కలిసి పెట్టుబడులు పెట్టి, కుట్ర పూరితంగా నష్టాలు తెచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  


Also Read: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్


తన సంస్థను, వందలాది మంది ఉద్యోగులను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోలో ముఖ్యమంత్రి జగన్‌ను జగదీశ్వరుడు వేడుకున్నారు.  హయగ్రీవ ఇన్ఫ్రాస్ట్రక్స్ కంపెనీక సాగర్ నగర్  సమీపంలో ఎండాడలో   12 ఎకరాల భూమి ఉంది. అది కంపెనీ పేరుపైనే ఉంటే.. ఎన్‌సిసి, బే పార్క్, రాడిసన్ లాగానే విజయసాయిరెడ్డి లాక్కుంటారని  తమ చేతిలో ఉంటే ఎవరూ తీసుకోరంటూ బినామీ బ్రహ్మాజీ పేరిట జీవీ బదలాయించారు.  ఆ తర్వాత వాటిని అమ్మకం పెట్టారని జగదీశ్వరుడు ఆరోపించారు. 


Also Read:  మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసుల సెర్చింగ్ ! అరెస్ట్ కోసమేనా ?


గతంలో తమ వద్ద భూములు కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు తనపై కేసులు వేస్తున్నారని వాటిని భరించే స్తోమత తనకు లేదన్నారు. దీనిపై జీవీని అడిగితే ముఖ్యమంత్రి, విజయసాయితో నేరుగా సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వంలో అనేక మంది పెద్దల ఆస్తులన్నీ తానే చూస్తున్నానంటూ బెదిరిస్తున్నారని వాపోయారు.  ముఖ్యమంత్రే తనను కాపాడాలని జగదీశ్వరుడు వేడుకుంటున్నారు.  ప్రస్తుతం జగదీశ్వరుడు ఆజ్ఞాతంలో ఉన్నారు.. 


Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?


ఈ అంశంపై ఆడిటర్, విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జీవీ అలియాస్ జీవీ నాగేశ్వరరావు స్పందించారు. జగదీశ్వరుడుతో తమ లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే సాగాయని అంటున్నారు. ఈ అంశంపై రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు చెబుతానని ఆయన ప్రకటించారు. విశాఖలో ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో ప్రముఖ కంపెనీగా ఉన్న హయగ్రీవ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వ్యవహారం బయటపడటం సంచలనంగా మారింది.


Also Read: అవినీతికి ఆధారాలున్నాయా..? స్కిల్ స్కాంలో సీఐడీకి హైకోర్టు ప్రశ్న... ఘంటా సుబ్బారావుకు షరతుల బెయిల్ !


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి