Crime News: ఢిల్లీలో అనంతపురం వాసి మృతి, దొంగను పట్టుకునే ప్రయత్నంలో రైలు ఢీకొనడంతో విషాదం

Gold Theft: గుంటూర జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఆత్మకూరు వద్ద ఐదు కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకున్నారు.

Continues below advertisement
ఢిల్లీలో బంగారం చోరీ
ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రానికి చెందిన బీఎస్‌ఎఫ్‌(BSF) జవాన్ మృతిచెందాడు. జమ్మూ కశ్మీర్‌కు విధుల నిమిత్తం భార్యా పిల్లలతో కలిసి వెళ్తుండగా... ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఓ దొంగ భార్య మెడలో గొలుసు లాక్కెళ్లాడు. దొంగకోసం రైలు నుంచి కిందకు దూకే ప్రయత్నంలో  పక్కనే ఉన్న పట్టాలపై లక్ష్మన్న పడిపోయాడు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వచ్చిన మరో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
 
Gold Theft: గుంటూరు జిల్లాలో భారీగా  బంగారం చోరీ జరిగింది. సుమారు ఐదుకిలోల బంగారు(Gold) నగలు అపహరణకు గురవ్వడంతో  పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు
 
బంగారం మాయం
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో  ఐదు కిలోల బంగారు ఆభరణాలు( Gold Ornaments) అపహరణకు గురయ్యాయి. విజయవాడలోని బంగారం దుకాణం నుంచి  ఐదు కిలోల ఆభరణాలను  సంచిలో పెట్టుకుని బైక్‌పై యజమాని ఇంటికి వెళ్తుండగా దుండగులు అడ్డుకుని తన వద్ద నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లారని బాధితుడు నాగరాజు పోలీసులకు చెప్పాడు. అయితే నాగరాజు బంగారు ఆభరణాల దుకాణం యజమానికి బంధువే. బంగారం అపహరణకు గురయ్యిందన్న  సమాచారం అందుకున్న పోలీసులు(Police)....అర్థరాత్రే రంగంలోకి దిగారు. బంగారం చోరీకి గురైన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.అయితే అక్కడ చోరీ జరినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతోపాటు...ఆ పరిసర ప్రాంతాల్లోకి  ఎవరూ కొత్త వ్యక్తులు వచ్చిన దాఖలాలు కనిపించకపోవడంతో  పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు చెబుతున్నదానికి అక్కడి పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతోపాటు....నాగరాజు తీరుపైనా అనుమానం వస్తుండటంతో పోలీసులు బాధితుడినే అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు.
 
అనుమానాస్పదం
బాధితుడు  నాగరాజు  వ్యవహారతీరే అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్షల విలువైన బంగారాన్ని రాత్రిపూట ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా  ఒక్కడే బైక్‌పై తీసుకువెళ్లడం...మార్గమధ్యలో దుండగులు అడ్డుకుని ఆభరణాలు లాక్కెళ్లారని చెప్పడం కట్టుకథగా భావిస్తున్నారు. సమీపంలోని సీసీకెమెరాల ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు...అనుమానాస్పదంగా  ఎవరూ కనిపించలేదని అంటున్నారు. పైగా విజయవాడ నుంచి నాగరాజును వెంబడించి వస్తున్న వారూ ఎవరూ లేరని నిర్థరించుకున్నారు.  నాగరాజు చెబుతున్నట్లు ఆభరణాలు నిజంగానే దుండగులు కొట్టేశారా లేక నాగరాజు డ్రామాలు వేస్తున్నాడా అన్న కోణంలో  పోలీసులు ఆరా తీస్తున్నారు.  అంత భారీ దొంగతనం చేసిన దుండగలు ఖచ్చతంగా అటు తెనాలి మార్గంలోనో లేక వెనక్కి వచ్చి చెన్నై- కోల్‌కతా రోడ్డు మీదుగా పారిపోవాలి. ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి.  ఖచ్చితంగా ఎక్కడో  ఒకచోట చిక్కేవారని పోలీసులు అంటున్నారు.  నాగరాజు మాటలు అంతగా  నమ్మబుద్ధి కావడంలేదని తెలిపారు. అందుకే నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.
 
సినీఫక్కీలో చోరీలు
ఇటీవలకాలంలో దుకాణంలో నమ్మకంగా పనిచేస్తున్న పనివారే చేతివాటం చూపిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. NTR జిల్లా జగ్గయ్యపేట బంగారం దుకాణానికి చెందిన ఓ గుమస్తా.....నెల్లూరులో ఆభరణాలకు ఆర్డరివ్వడానికి బంగారం తీసుకుని కారులో వెళ్తుంటే విజయవాడలో  ఆయన కారును అడ్డుకుని దుండగులు బంగారం లాక్కెళ్లారు. లక్షల విలువైన బంగారం అపహరణకు గురవ్వడంతో  భయంతో ఆ గుమాస్తా  బీపీ ఎక్కువై స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈలోగా పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ కాల్‌డేటా  వెలికితీశారు. సదరు బాధితుడు ఆస్పత్రి నుంచి బయటకు రాగానే విచారించగా...అసలు దొంగ అతనేనని తేలింది.యజమాని బంగారం దోచుకోవాలని పథకం వేసిన అతను....మరో ముగ్గురితో కలిసి ఈ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు.  ఇప్పుడు ఈ కథ కూడా అలాంటిదేమోనన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
 
 

 

Continues below advertisement
Sponsored Links by Taboola