శ్రీభాగ్ ఒప్పందం అమలు కోసం ప్రజా సంఘాలు ఉద్యమాలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజధాని కోసం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని పోరాటాలు చేస్తున్నాయి. ఇప్పుడు కృష్ణ రివర్ బోర్డు ఏర్పాటుకు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చూడుతున్నాయి.


రాయలసీమలో కృష్ణ నది నిర్వహణ యాజమాన్య బోర్డు(KRMB) ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని కోసం చేపట్టాల్సిన యాక్షన్‌ప్లాన్‌పై చర్చించడానికి శనివారం స్థానిక కృష్ణాకాంత ప్లాజాలో సమావేశమయ్యారు. ఉద్యమకార్యచరణ ప్రకటించారు. ఆర్విపిఎస్ (రాయలసీమ విద్యార్థి పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, ఆర్విఎస్ (రాయలసీమ విద్యార్థి సమాఖ్య) వ్యవస్థాపక అధ్యక్షుడు సీమకృష్ణ, ఆర్సిసి కో-ఆర్డినేటర్ రాజు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యాక్షుడు బాలు, ఆర్వైఎస్ఎఫ్ రంగముని నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Also Read: "దేశం" అడుగుతోంది.. దేశ సంస్కృతిపై ఎందుకీ రాజకీయ "మాటల" దాడి !?


సీమలో కృష్ణానది 123 కిలోమీటర్లు ప్రవహిస్తుందని అందుకు సరిపడా న్యాయం తమకు జరగడం లేదని వాపోయాయి ప్రజాసంఘాలు. కృష్ణా నదితో  సంబంధం లేని వైజాగ్‌లో కృష్ణ యాజమాన్య బోర్డు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకొవాలని అన్నారు. సీమలో కృష్ణ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారంలో కృష్ణ, తుంగభద్రలో నీళ్ల వాట తేల్చి రాయలసీమ ఇవ్వాలన్నారు. 


Also Read:194 మెగాపిక్సెల్‌తో మోటొరోలా ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా - లాంచ్ ఎప్పుడంటే!


ఉద్యమ కార్యచరణలో భాగంగా మొదటగా రాయలసీమలోని ఉద్యమ సంఘాలు, రైతు, విద్యార్థి, కుల ప్రజాసంఘాలతో కలిసి త్వరలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలలో, కళాశాలలో కృష్ణా యాజమాన్య బోర్డు ఏర్పాటుకై సెమినార్స్ ఏర్పాటు చేయనున్నారు. రాయలసీమ జిల్లాలలో కరపత్రాలు, గోడపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం, చివరగా కర్నూలులో నిరసన దీక్ష ఉంటుందని అన్నారు. 


Also Read:కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ వచ్చేస్తుంది - ఏకంగా 411 సీసీతో!


అప్పటికైనా ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించాయి ప్రజాసంఘాలు. 


Also Read: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను రెండుగా చూపటం సరికాదు.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ


Also Read: కల్వకుర్తి కింద కొత్త ఆయకట్టును పెంచలేదు


Also Read:కేఆర్ఎంబీ పరిధిలోకి ఆ విద్యుత్ ప్రాజెక్టులు


Also Read: గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల సూచన... హాజరు కాని తెలంగాణ