రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం కొత్త మోటార్‌సైకిల్స్‌పై పని చేస్తుంది. ఇవి ఈ సంవత్సరమే మనదేశంలో లాంచ్ కానున్నాయి. వీటిలో 650 సీసీ బైకులు కూడా ఉండనుండటం విశేషం. ఈ లిస్ట్‌లో అన్నిటికంటే ముందు ఎంట్రీ ఇవ్వబోయేది రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411.


ఈ బైక్ మనదేశంలో వచ్చే నెల ఏడో తేదీన లాంచ్ కానుంది. దీని లుక్ చూడటానికి హిమాలయన్ తరహాలో ఉండనుంది. స్క్రాంబ్లర్ తరహా అప్పీల్ ఉండనుంది కాబట్టి స్క్రామ్ అని కంపెనీ పేరు పెట్టింది. హిమాలయన్ బేస్ మీద ఈ బైక్‌ను కంపెనీ రూపొందించింది.


ఈ అడ్వెంచర్ మోటార్ బైక్ లుక్ చూడటానికి రగ్గ్డ్‌గా ఉండనుంది. గత కొన్ని నెలల్లో స్క్రామ్ 411ను మనదేశంలోని రోడ్ల మీద పరీక్షించారు. దీంతో ఈ బైక్‌కు సంబంధించిన కీలక వివరాలు కూడా లీకయ్యాయి. ఈ బైక్ చూడగానే మీకు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ గుర్తొచ్చినా... దానిలా ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ ప్రొటెక్టర్లు లేవు.


వాటి బదులు టాంక్ ష్రౌడ్స్‌ను ఇందులో అందించారు. మిగతా డిజైన్ అంతా దాదాపు హిమాలయన్ తరహాలోనే ఉండనుంది. ఈ స్క్రామ్ ఆరోగ్యవంతమైన గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందించనుంది. గరుకుగా ఉండే రోడ్ల మీద కూడా దీన్ని చాలా సులువుగా డ్రైవ్ చేయవచ్చు.


ఆర్ఈ స్క్రామ్ 411 బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 తరహాలోనే 24 బీహెచ్‌పీ, 32 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉండనుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ చానెల్ యాబ్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం ట్రిప్పర్ నావిగేషన్ ఉండనున్నాయి.


Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ వచ్చేసింది!


Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!