బాలిస్టిక్ మిసైల్స్(ballistic missiles) ప్రయోగించింది రష్యా(Russia). వ్యూహాత్మక దళాల డ్రిల్స్ విన్యాసాల్లో భాగంగా వీటని పరీక్షించినట్టు చెబుతోంది. ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు వీటిని టెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు ఆ దేశ ప్రతినిధి రెమ్లిన్.
బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు ప్రారంభమయ్యాయా లేదా అని అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ రెమ్లిన్ అవును అని సమాధానం ఇచ్చారు.
బెలారసియన్ కౌంటర్ అలెగ్జాండర్ లుకాషెంకోతో కలిసి కంట్రోల్ సెంటర్ నుంచి పుతిన్(Vladimir Putin) ఈ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని పరిశీలించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం రష్యా ఏరోస్పేస్ ఫోర్సెస్, సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ యూనిట్లు, స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్సెస్, నార్తర్న్, బ్లాక్ సీ ఫ్లీట్‌లతో కూడిన విన్యాసాలతో ఈ డ్రీల్స్ ప్లాన్ చేశారు.
మిలట్రీ కమాండ్ సన్నద్దత, కంబాట్ లాంఛింగ్ యూనిట్స్, యుద్ధ నౌకల సిబ్బంది, వ్యూహాత్మక క్షిపణి వాహకాల సంసిద్ధతను పరీక్షిస్తామంటోంది రష్యా రక్షణ శాఖ. అణ్వాయుధ దళాలు, అణుయేతర దళాల పని తీరును పరీక్షించే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి.
ఈ సన్నద్దత సైనిక విన్యాసాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అమెరికా విడుదల చేసంది. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకే రష్యన్ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నారని ఆరోపిస్తోంది అమెరికా. ఫిబ్రవరి 18న తీసిన ఓ ఫొటోను షేర్ చేసింది అమెరికా.
నోవోజెర్నోయ్‌లో ఉన్న ట్రూప్ టెంట్లు, ఫీల్డ్ హాస్పిటల్ అందులో కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో దాడి ప్రారంభం కావచ్చని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అనుమానం వ్యక్తం చేశారు. క్రిమియాలోని డోనుజ్లావ్ సరస్సు వద్ద మోహరించిన హెలికాప్టర్లు కూడా ఆ ఫొటోలు కనిపిస్తాయి. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.
వాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. దాడి చేసేందుకు సిద్ధపడుతున్నారు.అందుకు సిద్ధపడేటట్టు బలగాలను మోహరిస్తున్నారు అని అమెరికా రక్షణశాఖ మంత్రి ఆస్టిన్ అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేరే మార్గాన్ని ఎంచుకోవచ్చన్నారు US రక్షణ మంత్రి. యుద్ధం అనివార్యమైంది కాదని అభప్రాయపడ్డారు. ఈ చిత్రంలో ట్యాంకులు, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్లు (APC), పదాతిదళ వాహనాలు (IFVలు) చూడొచ్చు.
ఈ మాక్సర్ ఉపగ్రహ చిత్రం ఫిబ్రవరి 15, 2022న తీశారు. ఫిబ్రవరి 18, 2022న విడుదల చేశారు. ఉక్రెయిన్ సరిహద్దుకు తూర్పున దాదాపు 27కిలోమీటర్ల దూరంలో రష్యాలోని వాలుయ్కి వద్ద హెలికాప్టర్ విస్తరణ చూడవచ్చు.