Stick Fight Festival: కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో మరోసారి విషాద ఘటన చోటుచేసుకుంది. దేవరగట్టులో వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవం గత 100 సంవత్సరాలుగా కర్రలతో సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి... స్వామివారిని ఊరేగిస్తున్న సందర్భంలో భక్తులంతా కర్రలతో కొట్టుకోవడం వస్తున్నటువంటి ఆచారం. ఈ సంవత్సరం కూడా భక్తులు కర్రలతో కొట్టుకుంటున్న సందర్భంలో ఒకరి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. అంతే కాకుండా 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..?
అయితే దేవరగట్టు సమీపంలో కొండపై వెలసిన మాళమ్మ, మల్లేశ్వర స్వామికి రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించాల్సి ఉండగా.. వర్షం కారణంగా గంట ఆలస్యమైంది. జల్లులు కురుస్తున్న... కల్యాణం అనంతర కర్రల సమరం నిర్వహించారు. కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాల గట్టు, రక్షపడ, శమీ వృక్షం, ఎదురుబసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతూరులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెపణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా.. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఈ కర్రల సమరంలో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. వారిని ఆదోని, ఆలూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే బన్ని ఉత్సవంలో హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసినా.. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టినా స్థానికులు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. మొత్తానికి దేవరగట్టు కర్రల సమరంలో ప్రాణ నష్టం లేకపోవడంతో పోలీసులు, అధఇకారులు ఊపిరి పీల్చుకున్నారు. దేవరగట్టు కర్రల సమరానికి వెళ్తూ ఓ బాలుడు మృతి చెందాడు. కర్ణాటకలోని శిరుగుప్పకు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి కర్రల సమరాన్ని చూసేందురు వెళ్తూ గుండెపోటుతో మృతి చెందాడు.