Lovers Suicide: ప్రియుడు ఆత్మహత్య.. ఆ మరుసటి రోజే ఉరివేసుకొని బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ చదువుతున్న విద్యార్థిని సైతం ఆ మరుసటి రోజే బలవన్మరణం చెందింది. కర్నూలు జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Continues below advertisement

Lovers Suicide In Kurnool: ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన మరుసటి రోజే బీటెక్ చదువుతున్న విద్యార్థిని సైతం బలవన్మరణం చెందింది. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంలో ఇరు కుటుంబాలలో పెను విషాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆలూరులో ఈ  విషాదం చోటుచేసుకుంది.

Continues below advertisement

పోలీసుల సమాచారం మేరకు.. విజయ్, యువతి మధు జిల్లాలోని ఆలూరు సినిమా గేరిలో నివాసం ఉంటున్నారు. వీరు గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. విజయ్, మధు చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. స్కూల్లో చదువుతున్న అప్పటినుంచే వీరికి స్నేహం ఉంది. ఆపై సన్నిహితంగా మెలిగేవారు. విజయ్ ఐటీఐ చదువుతుండగా.. కడప జిల్లాలోని ఓ కాలేజీలో మధు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.  చిన్ననాటి నుంచి పరిచయం ఉంటడంతో కొంతకాలం కిందట అది ప్రేమగా మారింది. వీరు చనువుగా ఉంటున్నారని పెద్దలు గుర్తించారు. ఇకనుంచి ఇలాంటివి చేయకూడదని వీరిని హెచ్చరించారు.

కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి ప్రేమకు అడ్డంకిగా మారారు. ఎలాగైనా సరే వీరిని విడదీయాలని అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు అనంతపురం జిల్లా కదిరిలోని బంధువుల ఇంటికి పంపించారు. అయినా విజయ్, యువతి ఫోన్లో నిత్యం మాట్లాడుతూ ఉండేవారు. చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియుడు విజయ్ ప్రియురాలుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నాను అని చెప్పాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రియురాలుకు మెసేజ్ పెట్టాడు. పరిస్థితి చేదాటుతుందని భావించిన బీటెక్ విద్యార్థిని ప్రియుడు విజయ్ స్నేహితునికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఎలాగైనా ఇంటికెళ్లి చూడమని వేడుకుంది. స్నేహితుడు అతడి ఇంటికి వెళ్లి చూసే లోపు విజయ్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. 

విజయ్ చనిపోయాడని తెలుసుకున్న యువతి ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. ప్రియుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి లోనైంది. విజయ్ తనకు దూరమైన బాధను జీర్ణించుకోలేక యువతి వారి బంధువుల ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఒక్క రోజు వ్యవధిలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆలూరు పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లలు ఇలాంటి నిర్ణయం తీసుకుని తమకు కడుపుకోత నింపుతారని ఊహించలేకపోయామంటూ యువతి, యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవు అవుతున్నారు.

Also Read: Karimnagar: కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. కారు, స్తంభం మధ్యలో పడి మహిళ మృతి.. మరో ముగ్గురు కూడా..

Also Read: KCR Family: ముఖ్యమంత్రి ఫ్యామిలీలో విషాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Continues below advertisement