కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో 24 గంటల్లో ముద్దాయిలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో సహా సహకరించిన వారిని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నిందితులను  కస్టడలోకి తీసుకున్నారు.


కౌతాళం మండలం కామవరం గ్రామంలో భూ వివాదం పరిష్కరించే క్రమంలో శివ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈరన్న అనే వ్యక్తిని కూడా ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ రెండు హత్యలు కర్నూలు జిల్లాలోనే కలకలం రేపాయి. హత్యపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించిన కాసేపటికే హత్య చేసిందెవరో క్లారిటీ వచ్చేసింది. నిందితులను కూడా గంటల్లోనే పట్టుకున్నారు.  


మల్లికార్జున అనే వ్యక్తికి శివకు చాలా ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. చాలా సార్లు వీళ్లిద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కానీ గ్రామస్థుల జోక్యంతో ఎప్పటికప్పుడు వివాదం సద్దుమణిగేది. కానీ శివను ఎలాగైనా లేపేయాలని ప్లాన్ చేశాడు మల్లికార్జున. సమయం కోసం ఎదురు చూసేవాడు. 


ఇద్దరి మధ్య ఉన్న భూతగాదాను పరిష్కరించుకుందామని గ్రామస్థులతో కబురు పెట్టాడు మల్లికార్జున. సమస్య పరిష్కారమైతే మంచిదేకదా అంటూ గ్రామస్తులతో శివ వచ్చాడు. అప్పటికే తన స్నేహితులతో శివ మర్డర్‌కు స్కెచ్‌ గీసిన మల్లికార్జున... ఊరందరు చూస్తుండగానే హత్య చేశాడు. శివప్ప వర్గంపై యాసిడ్ పిచికారి చేసి కళ్లలో కారం కొట్టి విచక్షణారహితంగా నరకేేశారు మల్లికార్జున వర్గం. తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టారు. 


ఈ మారణ కాండలో శివతోపాటు వీరన్న అనే వ్యక్తి కూడా చనిపోయాడు. హత్య చేసిన అనంతరం సంఘటనా స్థలం నుంచి మల్లికార్జునతోపాటు మరో ఆరు మంది పరారయ్యారు. వీరు పారిపోవడానికి రామకృష్ణ పరమహంసతోపాటు మరికొందరు గ్రామస్థులు సహకరించినట్టు తెలుస్తోంది. 


హత్య జరిగిన వెంటనే నిందితులు హైదరాబాద్‌ బస్సు ఎక్కి ఎంజీబీఎస్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో అని ఆలోచిస్తున్న టైంలో పోలీసులు అటాక్ చేసి పట్టుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పారిపోవడానికి సహకరించిన గ్రామస్తులను కూడా అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ తెలిపారు. 


కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. 


Also Read: తిట్టాడని తండ్రిని చంపేస్తాడా.. ఆ కుమారుడి నేరం క్షమించరానిది: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు


Also Read: టోనీ ఎవరెవరి జాతకాలు బయట పెట్టనున్నాడు? ఆ బడాబాబులకు చిక్కులు తప్పవా ?