Weather Updates: తక్కువ ఎత్తులో నైరుతి దిశ నుంచి బలమైన గాలులు ఏపీలో వీస్తున్నాయి. దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ఫలితంగా నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గలేదు కానీ చలి గాలులు మాత్రం రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోవాతావరణం పొడిగా మారడంతో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నేడు వాతావరణం పొడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఉదయం వేళ చలి గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. రెండు రోజుల తరువాత వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా చూసుకోవాలని సూచించారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో గత రెండు రోజుల మాదిరిగా వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశం నిర్మలమై ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. ఈశాన్య దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
Also Read: Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్ హల్వా లేదండోయ్! మారుతున్న సంప్రదాయాలు!!
Also Read: NeoCov: త్వరలోనే మరో డేంజర్! ఊహాన్ శాస్త్రవేత్తల సంచలన ప్రకటన, ఇది వింటే వెన్నులో వణుకు ఖాయం!