ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మేనమామ కన్నుమూశారు. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ మేనమామ గునిగంటి కమలాకర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 94 సంవత్సరాలు. కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. శనివారం కామారెడ్డిలోని దేవి విహార్‌లోని తన సొంత ఇంట్లోనే కమలాకర్ రావు చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్ రావు చాలా కాలం క్రితమే కామారెడ్డి పట్టణంలో స్ధిరపడ్డారు.
కమలాకర్ రావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అందరూ కామారెడ్డికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కమలాకర్ రావు సంతానం అంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. కమలాకర్ రావు మృతితో కేసీఆర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన మేనమామతో తనకు చిన్న తనం నుంచి ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
తన బాల్యంలో చాలా సార్లు తాను మేనమామ ఇంటికే వస్తుండేవాడినని ముఖ్యమంత్రి గతంలో చాలా సార్లు పలు సందర్భాల్లో చెప్పారు. కామారెడ్డిలో పర్యటించిన ప్రతిసారి సీఎం కేసీఆర్ తన మేనమామ ఇంటికి వెళ్లేవారు. బాల్యంలో అనేక సార్లు వచ్చేవాడినని, అప్పుడు కామారెడ్డి గంజ్‌లో బెల్లం వాసన గుప్పుమని వచ్చేదంటూ గుర్తు చేసుకునే వారు. పదేళ్ల క్రితమే కమలాకర్ రావు భార్య చనిపోయారు. ఆ సమయంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చురుగ్గా నడుతుపుతున్నారు. ఆ సమయంలో ఆమె దశ దిన కర్మకు ఉద్యమ నేతగా కేసీఆర్ హాజరయ్యారు.
Also Read: Sangareddy: సంగారెడ్డిలో టీఆర్ఎస్ లీడర్ దారుణ హత్య.. తల, మొండెం వేర్వేరు చోట్ల.. కారణం ఏంటంటే..
మరోవైపు, కమలాకర్ రావు భౌతిక కాయాన్ని సందర్శకుల కోసం కామారెడ్డిలోని దేవి విహార్‌లో ఉంచారు. బంధువులతోపాటు కొంత మంది స్థానిక టీఆర్ఎస్ నేతలూ కమలాకర్ రావుకు నివాళి అర్పించారు. అనంతరం సమీపంలోని స్మశానవాటికలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పుడు కరోనా నేపపథ్యంలో కమలాకర్ రావు అంత్యక్రియలకు కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.
Also Read: Tirumala: పాము కాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు... పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు...