మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వీటన్నిటిపై గత కొన్ని రోజులుగా అనేక రకాలుగా సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఫిర్యాదులు పెరగడంతో ఏసిబి ఆధికారులు స్పందించారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌పై ఏకకాలంలో దాడులు చేశారు. దాదాపు పన్నెండు గంటలకుపైగా కార్యాలయంలో సోదాలు సాగాయి.  పలు రికార్డులు తనిఖీలు చేశారు. అయితే రికార్డులకు, క్షేత్రస్థాయిలో బిల్డింగ్ అప్రూవల్స‌్‌కు చాలా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు ఏసిబి అధికారులు. కానీ అధికారులు మాత్రం ఏసిబి దాడులను లైట్‌ తీసుకున్నట్టు కనిపిస్తోంది. 


మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో అవినీతిని నిరోధించడానికి ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు. బిల్డింగ్ అప్రూవల్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే అన్ని కరెక్ట్‌గా ఉంటే అక్కడికక్కడే ఆన్‌లైన్ వేదికగా అప్రూవల్ ఇచ్చేయాలి. కానీ ఇక్కడే అన్ని కరెక్ట్ గా ఉన్నప్పటికీ కచ్చితంగా నిర్మాణదారుడు ఆపీస్‌కు రావలసిందే. లేకపోతే ఫైల్ ఏదో ఒక కొర్రీ వేసి రిజెక్ట్ చేస్తూనే ఉంటారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది. దీంతో ఆన్ లైన్లో అప్లై చేసిన వెంటనే నిర్మాణదారుడు వచ్చి ఎంతో కొంత ముట్టచెప్పి బిల్డింగ్ అప్రూవల్ తీసుకొని వెళ్తారు. ఇక అంతే ఆప్రూవల్ ఇచ్చిన తరువాత ఆ బిల్డింగ్ ఏ విధంగా కడుతున్నారన్నది ఏ మాత్రం  పర్యవేక్షణ ఉండదు.పెద్ బిల్డింగ్‌లు, అపార్టమెంట్లు అయితే నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నప్పటికీ తమ ముడుపులు తమకు ముడితే చాలు అన్నట్లు వ్యవహరిస్తుంటారు టౌన్ ప్లానింగ్ అధికారులు.


ఈ విషయాలన్నిటిపై ఏసిబి అధికారులు ఫోకస్ పెట్టారు. గత 2018 నుంచి ఎన్ని బిల్డింగ్‌లకు పర్మిషన్లు ఇచ్చారు. ఎన్ని అపార్టమెంట్లకు పర్మిషన్ ఇచ్చారు అన్నదానిపై విచారణ చేపట్టారు. నిభందనలకు విరుద్దంగా నిర్మించిన బిల్డింగ్‌లను ఎన్నిటిని ఆపారు. వాటి వివరాలేంటి అన్నదానిపై లోతుగా విచారిస్తున్నారు. అయితే ఈ విచారణ జరగుతున్న టైంలోనే ఆన్లైన్‌లో మరో రెండు నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంతో ఏసిబి అధికారులు కంగుతిన్నారు. అయితే అనుమతిలిచ్చిన సదరు అధికారి ఆఫీస్‌కు రాకుండానే ఆన్లైన్లో  అనుమతి ఇచ్చారు. ఆ అధికారి కోసం ఫోన్ చేస్తే స్విఛ్చాప్ వచ్చినట్లు సమాచారం. ఏసిబి కాదు కదా...ఎవరు వచ్చినా ఎన్ని విచారణలు చేసినా తమనేమీ చేయలేరన్న ధీమాలో ఉన్నారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది.


ఏసిబి అధికారులు తర్వాత ప్లాన్ ఏంటి.. ఎవర్ని బాధ్యులను చేస్తారు... ప్రభుత్వానికి ఎలాంటి నివేదికిస్తారు. ఎలాంటి యాక్షన్ ఉంటుందన్నదానిపై క్లారిటీ లేదు. అటు ఏసీబీ అధికారులు కూడా నోరు మెదపడం లేదు. ఇంకా విచారణ కొనసాగుతుందని అంటున్నారు.  నిబంధనలకు విరుద్దంగా షాపింగ్ కాంప్లెక్స్, అపార్టమెంట్ల నిర్మాణాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లోనే వీటికి అడ్డుకట్ట వేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కామెంట్ చేస్తున్నారు. 


Also Read: Jagan Governer : మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోండి.. ఏపీ గవర్నర్‌కు ముఖ్యమంత్రి సూచన !


Also Read: Srikalahasti College : దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని ఒకే ఒక్క ఇంజినీరింగ్‌ కాలేజీ మూసివేత.. రోడ్డున పడ్డ ఉద్యోగులు !


Also Read: Corona Update: ఏపీలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి