కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం  రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జీవో జారీ చేసింది. దీన్ని నిలిపివేయాలని కోరుతూ విజయవాడకు చెందిన మహ్మద్‌ ఫరూక్‌ షుబ్లీ  ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ట్రిబ్యూనల్‌ను విజయవాడలో ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందని..ఇప్పుడు కర్నూలుకు తరలించడం మైనార్టీల హక్కులను హరించడమేనని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం సృష్టికి తీసుకెళ్లారు.


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవో సస్పెన్షన్.. పాత విధానంలోనే రేట్స్ ఖరారు చేయాలన్న హైకోర్టు !


 అయితే ప్రభుత్వ నిర్ణయంలో  జోక్యం చేసుకునే పరిధి తమకెక్కడిదని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పాటు వల్ల పిటిషనర్‌కొచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించింది. కర్నూలులో  ట్రిబ్యూనల్ ఏర్పాటు  చేయకూడదని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించింది.  కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు స్పష్టమైన కారణాలున్నాయని  ప్రభుత్వం తరపున వాదించిన ఏజీ శ్రీరామ్ తెలిపారు.  అత్యధిక ముస్లిం జనాభా కర్నూలులో ఉందన్నారు.  ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.   జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. 


Also Read: అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్.. ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?


కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చిచెప్పింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదంది. విశాఖపట్నం, అనంతపురం నుంచి హైకోర్టుకు వస్తున్నారని, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. గతంలో  వక్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  తదుపరి విచారణ జనవరి మూడో తేదీకి వాయిదా వేసింది. 


Also Read: పీఆర్సీ పెంపుపై ఉద్యోగ సంఘాలతో సజ్జల భేటీ... సీఎం జగన్ న్యాయం చేస్తారని హామీ


 


Also Read:  పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం


 


Also Read:  10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి