బర్డ్ ఫ్లూ లేదా ఏదైనా వైరస్ అని చెబితే.. చికెన్ ధరలు పడిపోతాయి. కానీ ఏదీ లేకున్నా.. మటన్ రూ.50కే దొరికిందంటే.. ఇక మాంసం ప్రియులకు పండగే పండగ. ఇక ఇలాంటి బంపర్ ఆఫర్ వింటే.. ఎవరైనా ఊరుకుంటారా?  మళ్లీ దొరకదు అని ఎగబడి మరీ మటన్ కొనుక్కున్నారు. డిమాండ్ ఉన్నా.. తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో   కిలో మటన్‌ ధర ఏకంగా 1000 రూపాయలకు వరకూ వెళ్లిన రోజులు ఉన్నాయి. ఏపీలో చాలా ప్రాంతాల్లో  800 రూపాయల వరకు కూడా అమ్మారు. ఇంత డిమాండ్ ఉన్న మటన్ 50 రూపాయలకు మటన్ దొరకడం వెనక ఓ కథ ఉంది. వ్యాపారస్తుల నడుమ పెరిగిన పోటీనే ఇందుకు కారణం.


ఇంతకీ 50 రూపాయలకే మటన్ దొరికింది ఎక్కుడో తెలుసా.. చిత్తూరు జిల్లాలోనే. వాల్మీకిపురంలోని మటన్ షాపుల్లో ఇలా.. 50 రూపాయలకే దొరికింది. ఇక్కడ వ్యాపారుల మధ్య పోటీతో కస్టమర్లు కావాల్సినదానికంటే.. ఎక్కువ మటన్ ఇళ్లకు తీసుకెళ్లారు. హే నువ్ 300 ఇస్తావా.. నేను 250కే ఇస్తా.. ఇలా సాగింది వారి మధ్య పోటీ. ఇలా తగ్గుతూ.. తగ్గుతూ.. కేవలం  50 రూపాయలకు కిలో అమ్ముడు పోయింది. వ్యాపారుల మధ్య పోటీని చూసి.. కస్టమర్లు కూడా కొనేందుకు పోటీ పడ్డారు. ఒక్కొక్కరు ఐదు కిలోల నుంచి 10 కిలోల వరకు తీసుకెళ్లారు. 


ఇది ఎక్కడ మెుదలైందంటే.. వాల్మీకిపురం గాంధీ బస్టాండు పక్కన మటన్‌ దుకాణాలు ఉన్నాయి. అయితే ఓ దుకాణం దారుడు ఏం చేశాడంటే.. కస్టమర్లు ఎక్కువగా రావాలని.. 300 రూపాయలకే మటన్ అమ్మడం ప్రారంభించాడు. ఇంత తక్కువ అయ్యేసరికి.. కస్టమర్లు అతడి షాపు దగ్గరకు ఎగబడ్డారు. ఇది చూసిన పక్కషాపుల వాళ్లు.. 200లకు అమ్మేశారు. నేనేం తక్కువనా.. నేను తగ్గిస్తా అని మరో వ్యక్తి.. 150కే ఇచ్చేశాడు. మరొకరు వంద, చివరికి 50 రూపాయలకు రేట్ దిగి వచ్చింది. ఇలా పోటీకి పోయి.. చాలా నష్టపోయారు.. దుకాణం దారులు. 


Also Read: AP CM Jagan : పల్నాడులో రూ. 1500 కోట్లతో సిమెంట్ పరిశ్రమ.. సీఎంను కలిసిన శ్రీసిమెంట్స్ ఓనర్లు !


Also Read: AP Moive Tickets GO : జీవో నెం.35 రద్దు అన్ని ధియేటర్లకూ వర్తిస్తుంది.. క్లారిటీ ఇచ్చిన హైకోర్టు !


Also Read: Palasa Cashew Cultivation: తీవ్ర నష్టాల్లో సిక్కోలు జీడి పరిశ్రమ... మూతపడుతున్న పలాస పరిశ్రమలు...


Also Read: Vizag Land Kabja : వైసీపీ నేతలు ఆస్తులు లాగేసుకుని రోడ్డున పడేశారు.. సీఎం జగన్ కాపాడాలి .. విశాఖలో ప్రముఖ వ్యాపారవేత్త వేడుకోలు !