చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రకు వెళ్లలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలంతా మెచ్చుకునే విధంగా పాలన చేస్తుంటే జగన్‌ మోహన్‌ రెడ్డి, మహిళ అయిన హోంమంత్రిని అయ్యన్నపాత్రుడు అమ్మనా బూతులు తిట్టారని విమర్శించారు. పత్రికల్లో రాయలేని విధంగా, టీవీల్లో చూపించలేని విధంగా ఉన్న అయ్యన్న మాటలు చంద్రబాబు స్క్రిప్టేనన్నారు.  ప్రజాస్వామ్య పద్దతిలో చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద నిరసన తెలియచేయడానికి వెళ్లానని దండయాత్రకు కాదన్నారు. అయితే తాను కారు దిగక ముందే తన కారుపై రాళ్లు వేశారని ఆరోపించారు. Also Read : డ్రగ్స్ కేసులో తరుణ్, పూరీలకు క్లీన్ చిట్ ! మరి మిగతా వాళ్ల సంగతేంటి ?

  
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఒక పౌరుడిగా, బాధ్యతగల వ్యక్తిగా నిరసన తెలియచేయడానికి మాత్రమే వెళ్లానని జోగి రమేష్ పదే పదే తెలిపారు. అలా వెళ్లినందుకే తమపై దాడి చేసి అన్ని విధాలుగా రచ్చ చేసి తిరిగి నిందలు వేస్తున్నారని జోగి రమేష్ అన్నారు. గూండాలను తెచ్చింది, పంపించిందీ చంద్రబాబు నాయుడనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఏవైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రిగారికి అర్జీ ఇవ్వడానికి నిరసన తెలియచేయడానికి వెళతమని.. అలాగే తాను చంద్రబాబు ఇంటికి వెళ్లామన్నారు. టీడీపీ నేతలు కూడా నిరసన,ముట్టడి చేపట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎప్పుడైనా ఎదురుదాడి చేశారా అని ప్రశ్నించారు. Also Read : చంద్రబాబుకు జగన్ క్షమాపణలు చెప్పాలన్న రఘురామ !


చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తూ మళ్లీ తమపైనే ఎదురుదాడి చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. అయ్యన్నపాత్రుడితో ఆ మాటలు మాట్లాడిస్తూ సమాజంలో చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి అరాచకాలు పన్నేందుకు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. తాను ఆర్జీ ఇవ్వడానికి వచ్చానని దీన్ని కూడా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో పరివర్తన రావాని  అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలపై చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. Also Read : ఎంఐఎంనే టార్గెట్ చేసిన అమిత్ షా ! ఢిల్లీలో దోస్తి - తెలంగాణలో కుస్తీ బీజేపీ విధానం అదేనా !?


ప్రభుత్వ పథకాలు ఎవరికైనా అందకపోతే వారికి ఇవ్వాలనిఅజగాలని అంతే కానీ బూతు పురాణం వినిపించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెచ్చగొట్టే కార‍్యక్రమాలు చేస్తే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.  ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే భాషను మార్చుకోకపోతే చంద్రబాబు ఎక్కడ పర్యటించినా అడ్డుకుని నిరసన తెలుపుతామని జోగి రమేష్ హెచ్చరించారు.  చివరిగా వ్యక్తిగత దూషణలు జరిగేతే మాత్రం నిన్న జరిగింది ఆరంభం మాత్రమేనని ఇంకా చాలా ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ నేతలు తమ నిరసనను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తే తాము కూడా అయ్యన్న వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు 


 


Also Read : పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..