వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలపై చేసిన తిట్లపై సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు " మై సన్ " అన్నందున చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం సరి కాదన్నారు. పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ కర్రలు, రాళ్లతో "శాంతియుత దాడి"కి వెళ్లాల్సిన అవసరం ఏముందని రఘురామ ప్రశ్నించారు. ఇంత కాలం వైసీపీ నేతలు నేతలు మాట్లాడిన భాషకు బాధ్యత వహించాలని అన్నారు.


Also Read : వ్యాక్సినేషన్ లో భారత్ ప్రపంచ రికార్డు.. ప్రధాని మోడీకి బర్త్ డే గిఫ్ట్ గా 2.5 కోట్ల టీకాలు పంపీణీ


జోగి రమేష్‌ను ఎవరు ప్రోత్సహించారో వారే బాధ్యత తీసుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు. అసెంబ్లీలో తనను అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌తో జోగి రమేష్ దూషించారని ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతో కనిపించారని రఘురామ తెలిపారు. ఆ సమయంలో తాను జగన్‌ను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారన్నారు. అయితే టీడీపీలో ఉన్న తనను టిక్కెట్ ఆఫర్ చేసి బతిమాలి పార్టీలో చేర్చుకున్నారని.. ఈ విషయాన్ని కాదని చెప్పాలని ఆయన సవాల్ చేశారు. అంతకు ముందు తాను ఉన్న పార్టీలోనే ఉన్నట్లయితే మూడు లక్షల మెజార్టీతో గెలిచేవాడిన్నారు. ఇప్పటికైనా పోయిందేమీ లేదని... తనను రాజీనామా చేయాలని సవాల్ చేస్తున్నారని.. తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేసి.. పోటీకి సిద్ధమైతే... తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తానని సవాల్ చేశారు. Also Read : ఎంఐఎంనే టార్గెట్ చేసిన అమిత్ షా ! ఢిల్లీలో దోస్తి - తెలంగాణలో కుస్తీ బీజేపీ విధానం అదేనా !?


ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇలాంటి పరిస్థితులే ఉంటే రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు వస్తాయని రఘురామ హెచ్చరించారు. అధికార పార్టీగా ఉన్న వారు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి విషయంలో తాను న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. పెద్ద ఎత్తున పాలక మండలి సభ్యులను నియమించడం ద్వారా స్వామి వారికి అన్యాయం జరుగుతుందని ... భక్తులకు ఇబ్బందులు వస్తాయని రఘురామ స్పష్టం చేశారు. ఇప్పటికే తిరుమలలో భక్తుల సౌకర్యాలకు ధరలు పెంచేశారని గదుల అద్దె నుంచి వీఐపీ దర్శనం కోసం రూ. పదివేల టిక్కెట్లు అమ్ముతున్నారని గుర్తు చేశారు. పైరవీకారులకు.,. సీబీఐ కేసులు ఉన్న వారికి సభ్యత్వం ఇచ్చారని ఆరోపించారు. దేవుడి కి న్యాయం కోసం తాను న్యాయపోరాటం చేస్తానని దేవుడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. దయచేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని రఘురామ కోరారు. 


Also Read : పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..