దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసుల సంఖ్య 3.6 శాతం మేర పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 35,662 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో సగానికి పైగా కేసులు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో కేరళలో 23,260 కేసులు నమోదవ్వగా.. 131 మంది చనిపోయారు. తాజాగా నమోదైన వాటితో కలిపి దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. 


నిన్న ఒక్క రోజే కోవిడ్ బాధితుల్లో 281 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,44,529కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 33,798 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,26,32,222కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,40,639 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 97.65 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 1.02 శాతంగా ఉంది. నిన్న 14.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.


ఒక్క రోజులో 2.5 కోట్ల టీకాలు.. టీకా పంపిణీలో భారత్ రికార్డు..
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిన్న (శుక్రవారం) రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ జరిగింది. దేశవ్యాప్తంగా నిన్న 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు. ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు అందించడం ఇదే తొలిసారి అని చెప్పారు.






Also Read: నేను 2 నెలల గర్భవతిని.. ఒక్కమాటైనా చెప్పకుండా నా భర్త ఇండియా వెళ్లిపోయాడు.. కెనడాలో హైదరాబాద్ మహిళ


Also Read: Bangalore News: ఆకలికి తట్టుకోలేక ఆగిన పసి గుండె... కుటుంబం ఆత్మహత్యతో చోటుచేసుకున్న విషాద ఘటన... మరోచోట చిన్నారిని హత్య చేసిన కసాయి తండ్రి