టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, నటుడు తరుణ్‌లు డ్రగ్స్ వాడలేదని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ రిపోర్ట్ తేల్చింది. వారి వద్ద నుంచి ఎక్సయిజ్ శాఖ సేకరించిన నమూనాల్లో ఎలాంటి డ్రగ్స్  ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. 2017లో విచారణ సమయంలో  ఇద్దరి నుంచి బ్లడ్ శాంపిల్స్‌తో పాటు వెంట్రుకలు, గోళ్లు కూడా సేకరించారు. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. ఆ రిపోర్టులు ఇప్పుడు వచ్చాయి. ఈ రిపోర్టుల గురించి ఇప్పుడు బయటకు తెలిసింది కానీ గత గతేడాది డిసెంబరు 8నే ఎక్సైజ్ శాఖకు ఎఫ్ఎస్ఎల్ అధికారులు నివేదికలు సమర్పించారు.  కెల్విన్ పై ఛార్జ్ షీట్ తో పాటు వివరాలు కోర్టుకు సమర్పించారు. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించారు. Also Read : బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్.. హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చిన నాగ్..


ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న రంగారెడ్డి జిల్లాలో కెల్విన్‌ను డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2017లో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. సినీ ప్రముఖులందర్నీ వరుసగా పిలిచి.. డైలీ సీరియల్‌గా పోలీసులు విచారణ జరిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ ఈ కేసును దర్యాప్తు చేశారు. అరవై మందికిపైగా ప్రశ్నించారు. వీరిలో టాలీవుడ్ తారలు పన్నెండు మంది వరకూ ఉన్నారు. దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. అందర్నీ విచారించిన తర్వాత వారి శాంపిల్స్ పంపాల్సిన చోటికి పంపిన తర్వాత కేసు సైలెంటయిపోయింది. Also Read : 'గుడికి వచ్చి.. బుద్ధుందా..?' ఘాటు బదులిచ్చిన సమంత.. వీడియో వైరల్..


2017 డిసెంబర్ నుంచి చార్జిషీట్లు వేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2018 జూలైలో.. నలుగురు సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని.. వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయన్న ప్రచరం జరిగింది.  చివరికి 2019 మేలో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో సినీ తారల పేర్లు ఎవరివీ లేవు.  అప్పట్లో ఎక్సైజ్ శాఖ నుంచి మీడియాకు విచారణ లీకులు అందేవి. కథలు కథలుగా తారల డ్రగ్స్ వ్యవహారాల గురించి చెప్పుకునేవారు. టాలీవుడ్ సెలబ్రిటీలను పోలీసులు విచారించిన తర్వాత మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరూ బయటపడలేరని అందరూ ఇరుక్కుపోయినట్లేనని భావించారు. కానీ ఎవరికీ డ్రగ్స్ అంటే ఏమిటో లేదని తేలిపోయింది.Also Read : ఉపేంద్రకి హ్యాపీ బర్త్ డే చెప్పిన రామ్ గోపాల్ వర్మ. ఉప్పీతో యాక్షన్ ఫిల్మ్ ప్రకటించిన ఆర్జీవీ..


ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ తాజాగా నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది. అయితే ప్రస్తుతం చార్జిషీట్లలో ఎక్సైజ్ శాఖ వారికి ఎలాంటి ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇస్తోంది. అయితే ఇద్దరి ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులు మాత్రమే బయటకు వచ్చాయి. మిగతా వారి రిపోర్టుల సంగతేమిటన్న విషయం తేలాల్సి ఉంది. వారి నుంచి శాంపిళ్లు సేకరించలేదా.. లేకపోతే రిపోర్టులు రాలేదా అన్నదానిపై స్పష్టత లేదు. 


Also Read : ‘MAA’ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది..షెడ్యూల్, నియమ నిబంధనలు ఇవే..