దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ఆర్జీవి. రాను రాను హిట్ అనే మాటకి దూరమైపోయాడు రామూ. పైగా వివాదాలను వెతుక్కుని మరీ కొనితెచ్చుకుని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ సంచలనాలకు కేరాఫ్ అవుతున్నాడు. అయితే తనకు నచ్చిన కాన్సెప్ట్ తో విన్నూత్నంగా ఆలోచించి సినిమాలు తీసే ఆర్జీవీ ఈ సారి నటుడు ఉపేంద్రతో ఓ సినిమా చేయనున్నట్టు ట్వీట్ చేశాడు. ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఆర్జీవీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఇద్దరి కలయికలో త్వరలో సినిమా రాబోతుందని  చెప్పాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఉపేంద్రతో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.


HAPPY to announce that Me and @nimmaupendra are starting an action film VERY SOON and here’s wishing him MANY HAPPY RETURNS OF THE DAY #HappyBirthday #upendra pic.twitter.com/nFaNhZYYNt






రామూ తీసుకున్న నిర్ణయం సంగతి తెలిసిన నెటిజన్లు బండి ఏమైనా ట్రాక్ లో పడుతోందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. దీనికి సంబంధించిన అప్ డేట్స్ కోసం అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరు 18 ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా   ‘కబ్జా’ థీమ్ పోస్టర్ లాంచ్ చేశాడు వర్మ.



కన్నడనాట తరగని క్రేజ్ సొంతం చేసుకున్న ఉప్పీ..నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా  సినీ ప్రియులను మెప్పించాడు. జనం కోసం మనం అంటూ 2018లో ‘ఉత్తమ ప్రజాకీయ పక్ష’ అనే రాజకీయ పార్టీ ప్రారంభించి తాను పోటీ చేయకుండా పలువురు అభ్యర్థులను బరిలోకి దింపాడు. ఉడిపి సమీపంలో ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఉపేంద్ర బెంగళూరులోని ఏపీయస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బి.కామ్ చదివాడు. చదువుకునే రోజుల నుంచీ నాటకాలు రాయడం, నటించడం అంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టమే ఇండస్ట్రీకి నడిపించింది. తనకు దూరపు బంధువైన కాశీనాథ్ తెరకెక్కించిన ‘అనంతన అవాంతర’ అనే కన్నడ సినిమాకు అసోసియేట్ గా పనిచేయడమే కాదు, అందులో చిన్న పాత్రలో నటించాడు. తాను తయారు చేసుకున్న కథతో ‘తర్లే నన్ మగ’ చిత్రాన్ని రూపొందించాడు.  ఆ తర్వాత‘ష్!’, ‘ఓం’ తెరకెక్కించాడు. 1995లో టాప్ గ్రాసర్ గా రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఓం’ తెలుగులో రాజశేఖర్ హీరోగా ‘ఓంకారం’ పేరుతో  వచ్చింది. ఆ తర్వాత ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన ‘ఎ’ సంచలన విజయం సాధించింది. ‘కన్యాదానం’, ‘ఉపేంద్ర’ “ఒకే మాట, రా!, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్‌ సత్యమూర్తి” వంటి తెలుగు చిత్రాల్లో హీరోగా, కీలక పాత్రల్లోనూ నటించాడు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘ఘని’లోనూ ఉపేంద్ర కీ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పుడు ఆర్జీవీతో ప్రాజెక్ట్ ఉపేంద్ర కి ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి.


Lso Read: వెంకటేష్-మీనా ‘దృశ్యం 2’ మూవీపై క్రేజీ అప్డేట్


Also Read: ‘మా కథకుడు రెడీ’ ‘పంచతంత్రం’ సినిమా నుంచి బ్రహ్మీ పోస్టర్ అదుర్స్


Also Read: ‘హనుమాన్ ఫ్రం అంజనాద్రి’ అంటూ మరో కాన్సెప్ట్ తో ఆసక్తి పెంచిన జాంబిరెడ్డి దర్శకడు ప్రశాంత్ వర్మ


Also Read: పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..


Also Read: ‘MAA’ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది..షెడ్యూల్,నియమనిబంధనలు ఇవే..