Panchathantram Movie update: ‘మా కథకుడు రెడీ’ ‘పంచతంత్రం’ సినిమా నుంచి బ్రహ్మీ పోస్టర్ అదుర్స్

పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కుతోన్న సినిమా ‘పంచతంత్రం’. ఈ సినిమాకు సంబంధించి మా కథకుడు రెడీ అంటూ పోస్టర్ విడుదల చేసింది యూనిట్

Continues below advertisement

పద్మశ్రీ’ బ్రహ్మానందం , సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. మాకథకుడు రెడీ అంటూ బ్రహ్మానందం  పోస్టర్ విడుదల చేసింది టీమ్.

Continues below advertisement

పెళ్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వాతిరెడ్డి భర్తతో ఇండోనేషియాలో సెటిలైంది. ఇప్పుడు మళ్ళీ ‘పంచతంత్రం’ తో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమాలో  భాగం కావడం గర్వంగా, సంతోషంగా ఉందని చెప్పింది లేఖ పాత్రలో నటిస్తోన్న శివాత్మిక. పదిరోజుల క్రితం దివ్య శ్రీపాద బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. కొత్తగా పెళ్లై సాధారణ మధ్య తరగతి కుటుంబంలోకి అడుగుపెట్టిన దేవి పాత్రలో దివ్య కనిపించనుంది. సినిమాల్లో అన్ని క్యారెక్టర్లను అందంగా, ఆసక్తికరంగా రాసుకున్నామన్న దర్శకుడు అన్నిటి కంటే దేవి పాత్ర చాలా ప్రత్యేకం అన్నాడు. సదాసీదాగా, అమాయకంగా కనిపించే దేవి ఇంటికి, తనకు కష్టం వచ్చినప్పుడు కుటుంబం కోసం పోరాడే విధానం ప్రేక్షకులను మెప్పిస్తందన్నారు. కుటుంబ బాధ్యతలు మోసే పాతికేళ్ల ప్రతి ఆడపిల్ల దేవి పాత్రలో తమను తాము చూసుకుంటారన్నాడు దర్శకుడు.

Alos Read: ‘హనుమాన్ ఫ్రం అంజనాద్రి’ అంటూ మరో కాన్సెప్ట్ తో ఆసక్తి పెంచిన జాంబిరెడ్డి దర్శకడు ప్రశాంత్ వర్మ

 ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు – చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన… ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామన్నారు మేకర్స్. ఐదు భావేద్వేగాల మిళితమైన చక్కటి కథ ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి” అని  చెప్పారు.  చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చిన ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Also Read: పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..

Also Read: ‘MAA’ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది..షెడ్యూల్,నియమనిబంధనలు ఇవే..

Continues below advertisement