బిగ్ బాస్ సీజన్ 5 మొదలై రెండో వారం పూర్తి కానుంది. గత వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన రచ్చ చూస్తూనే ఉన్నాం. కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ లో రెచ్చిపోయి ఆడారు అందరూ. ఈ క్రమంలో ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకోవడాలు.. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడాలు చూశాం. బిగ్ బాస్ షో అనే సంగతి మర్చిపోయారా..? అన్నట్లుగా ప్రవర్తించారు. ఏదేమైనా.. ఈ షో మాత్రం రేటింగ్స్ లో దూసుకుపోతుంది.
ఇక శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో రామ్ చరణ్ కనిపించి ఆశ్చర్యపరిచారు. 'హౌస్ లో కొంచెం ఆర్డర్ తగ్గింది కదూ.. సెట్ చేద్దాం' అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ తో ప్రోమో మొదలుకాగా.. 'He is the mr. tees maar khan racha' అనే పాటతో బిగ్ బాస్ స్టేజ్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.
Also Read : 'విక్రమార్కుడు 2' కథ రెడీ.. మరి డైరెక్టర్ దొరుకుతాడా..?
చరణ్ ను బిగ్ బాస్ టీవీలో చూసిన హౌస్ మేట్స్ థ్రిల్ ఫీల్ అవుతూ.. అందరూ లేచి నిల్చొని వెల్కమ్ చెప్పారు. అది చూసిన నాగ్.. 'గుర్తు పెట్టుకుంటాను.. నేనొచ్చినప్పుడు ఎవరూ లెగలేదు' అంటూ హౌస్ మేట్స్ ని ఆటపట్టించాడు. అనంతరం రామ్ చరణ్ 'ఈరోజు నేను కొంచెం లోబోలాగా డ్రెస్ అయి వచ్చినా' అంటూ చెప్పగా.. లోబో మోకాళ్లపై నుంచొని దండం పెట్టాడు.
ఆ తరువాత నాగ్.. ఉమాదేవిని పరిచయం చేస్తూ.. 'చాలా మంది మనిషి.. మాటలు కొంచెం అప్పుడప్పుడూ.. బూతులు మాట్లాడుతుంది' అనగానే చరణ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకుంది. 'మీతో వర్క్ చేయాలనుకుంటున్నా' అంటూ శ్వేతా.. రామ్ చరణ్ కి చెప్తుండగా.. 'పైకి అలా మాట్లాడుతుంది చరణ్.. కానీ చాలా వైల్డ్' అంటూ కౌంటర్ వేశారు. ఆ తరువాత షణ్ముఖ్.. చరణ్ కి లవ్యూ సర్ అని చెప్పాడు. అది విన్న నాగ్.. 'ఇప్పుడు నీకు చెప్తున్నాడు.. రోజూ మాత్రం దీప్తికి చెప్తాడు' అని సెటైర్ వేయగా.. అందరూ నవ్వేశారు.
హమీదకి చరణ్ హాయ్ చెప్పగా.. 'హమీదాను ప్రేమించడానికి శ్రీరామ్ ట్రై చేస్తున్నాడు.. కానీ హమీద మాత్రం ఇప్పటివరకు ఎస్ చెప్పలేదు' అంటూ డైలాగ్స్ వేశారు నాగ్. ఆ తరువాత ప్రియా.. చరణ్ ను హౌస్ లోపలకి పంపించమని నాగ్ ని రిక్వెస్ట్ చేయగా.. 'రెండు వారాలు ఉంచేద్దామా లోపల' అని నాగ్ అనగా.. 'హ్యాపీగా' అంటూ ఆన్సర్ చేసింది ప్రియా. ప్రోమో చివర్లో నాగ్ హౌస్ మేట్స్ ని ఉద్దేశిస్తూ.. 'డోంట్ బి టూ హ్యాపీ.. చాలా సెట్ చేయాలి' అంటూ వార్నింగ్ ఇచ్చారు.