మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,  ముఖ్యమంత్రి జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని జగన్ తెలిపారు. ఇది 81 శాతం అన్నారు.


Also Read : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?


అలాగే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల అంటే 99 శాతం వైఎస్సార్‌ అభ్యర్థులే గెలిచారని గుర్తు చేశారు. ఇక 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్‌ సంతోషంవ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని.. అందుకే వారికి మేలు చేసే పాలన అందిస్తున్నామని తెలిపారు. పాలన చేపట్టినప్పటి నుండి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని స్పష్టం చేశారు. అదే సమయంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. కొన్ని మీడియా సంస్థలపైనా ఆరోపణలు చేశారు.  ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశాయని అయినా ప్రజలు నమ్మలేదన్నారు. 


Also Read : కేసీఆర్‌ గుడిని అమ్మేస్తున్న భక్తుడు ! దేవుడు కరుణించలేదా? పూజారి కనికరించ లేదా?


ప్రతిపక్షం​ ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకునే పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలను అడ్డుకోవడానికి విపక్షం అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని.. అదే పనిగా కోర్టులకు వెళ్లిందన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏడాదిన్నర పాటు ఎన్నికల ప్రక్రియ సాగేలా చూశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 


Also Read : గుజరాత్ లో రూ.9వేల కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఆ ముఠాకు విజయవాడతో సంబంధాలు


రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ఫలితాలను నమోదు చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదన్న కారణంతో తెలుగుదేశం పార్టీ నామినేషన్లు వేసిన తర్వాత పోటీ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది. అయితే కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు సీరియస్‌గా ప్రచారం చేయడంతో కొన్ని చోట్ల ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందారు. ఈ ఫలితాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 


ముఖ్యమంత్రిని దింపేయాలని.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చేస్తున్నారు


ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని రకరకాల శక్తులు పనిచేస్తున్నాయి. ఒకవైపు కొవిడ్ తో పోరాడుతున్నాం.. మరోవైపు ప్రతిపక్షం, కొన్ని దినపత్రికలు, ఛానళ్లతో పోరాడుతున్నాం. అబద్ధాన్ని నిజం చేయాలని రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ.. కేవలం వాళ్లకి కావాల్సిన వాళ్లు ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి..కచ్చితంగా ముఖ్యమంత్రిని దింపేసేయాలి.. అని చంద్రబాబును భూజన వేసుకుని పత్రికలు నడుపుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ప్రజలకు మంచి జరిగే పనులపై తప్పుడు వార్తలు, కోర్టుల్లో కేసులు వేయడం చూస్తున్నాం. ఎలాంటి కుతంత్రలు చేసినా.. వైసీపీ వైపే ప్రజలు ఉన్నారు. ఎన్నికల ఫలితాలే నిదర్శనం. భవిష్యత్ లో ఇంకా ఎక్కువ కష్టపడతాం. 


                                                                                         - వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి


Also Read : తెలంగాణలో ఓకే - ఏపీలోనే కష్టాలు ! చెప్పుకోవడానికి చిరంజీవి బృందానికి జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదా ?