TDP News :    మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు టీడీపీ మహానాడు నిర్వహించనుంది.  27న మహానాడు, 28న భారీ బహిరంగ సభ జరగనుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున డెలిగేట్స్‌ రానున్నారని చెప్పారు. లక్షలాది మంది మహానాడుకు తరలిరానున్నారన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు సారధ్యంలో కమిటీలు వేసి త్వరలోనే పనులు అప్పగిస్తారన్నారు. కనీస సౌకర్యాలు లభించని చోట గ్రామాల్లో టీడీపీ అభిమానులు కార్యకర్తలకు విడిది ఏర్పాటు చేయాలని పిలుపునచ్చారు. 


మహానాడు ఎన్టీఆర్‌కు అంకితం


మహానాడును స్వర్గీయ ఎన్టీఆర్‌కు అంకితమివ్వబోతున్నామని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు మహానాడులో జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఆటవిక రాజ్య పరిపాలన జరుగుతోందని, ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్నారని..  రాజ్యంగం కల్పించిన హక్కుల్ని ప్రభుత్వం అణిచి వస్తోందన్నారు. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత్రృత్వంలో ఉన్నామా తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నామని బుచ్చయ్య చౌదిర ఆవేదన వ్యక్తం చేశారు.  అధికార పక్షానికి కొమ్ముకాస్తూ పోలీసు వ్యవస్థ గబ్బుపట్టిపోతుందన్నారు. సీఐడీ వ్యవస్థ దోషులను నిర్ధోషులుగాను, నిర్ధోషులను దోషులగాను చిత్రించే పవిత్ర కార్యక్రమాన్ని నెరవేర్చడంలో అద్వితీయంగా పనిచేస్తుందని అన్నారు. కనీసం మనం చట్టంలో పనిచేస్తున్నాము.. రాజ్యాంగ బద్దంగా పనిచేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోలీసు వ్యవస్థలో లేకుండా పోవడం దురదృష్టకరం.. అర్ధరాత్రి నైట్‌ డ్రస్‌లో ఉన్న ఆడపిల్లను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారని  మండిపడ్డారు.  ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం కోల్పోయాడు. అభద్రతాభావంలో ఉన్నాడన్నారు. ఫ్యాన్‌ రెక్కలు ఊడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం పోతే జైలుకు వెళ్లక తప్పదు భయాందోళనలో ఉన్నాడని అన్నారు. పాతకేసులతోపాటు కొత్తకేసులు ఉండనున్నాయని,  ఈనాలుగేళ్లలో జరిగిన దోపిడీ మీద, అవినీతి అక్రమాల మీద విచారణ ఎదుర్కోక తప్పదు అనేది ఆయనకు అర్ధమవుతుందన్నారు.


 ఏపీని జగన్ నాశనం చేశారన్న గోరంట్ల


అధికారులు పిచ్చోళ్లు .. అధికారులు అధికారం శాస్వతం అనుకుని ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను ,భావ స్వేచ్ఛను హరిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక కులాన్ని టార్గెట్ చేసి  ఇండ్రస్ట్రీలు మూయించేస్తున్నాడు. పత్రికలు, చానెల్స్‌మీద దాడులు చేస్తున్నాడు. రాష్ట్రంలో చానెల్స్‌లో చూపించకూడదలు, పత్రికల్లో రాకూడదలని, వేల కోట్లు  సాక్షి పేపర్‌కు, సాక్షి టీవీకు, దాని అనుబంధ పేపర్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు.   రామోజీరావు మార్గదర్శి 40 ఏళ్లుగా సేవచేస్తున్నటువంటి చిట్‌ఫండ్‌ సంస్థ.. ఎక్కడా దానిపై ఆరోపణలు లేవు.. ఫైనాన్షియల్‌ సర్ధుబాటులు ఉంటాయి. అంతవరకే.. రామోజీ బెడ్‌మీద ఉంటే ఫోటోలుతో తీసి పేపర్లులో వేస్తున్నారు. ఏదో నేరం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరైనా డిపాజిట్‌ దారులు కానీ, చిట్‌ దారులు కానీ కంప్లైంట్‌ ఇవ్వలేదు.. సీఐడీ పరిస్థితి బురద జల్లి మీరే తుడుచుకోమంటున్నట్టు ఉంటుంది. గత రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక నిందలు వేశారు.. కేవలం బురద జల్లుతామని చూస్తున్నావు. 13 కేసులు ఎదుర్కొంటున్నావు. 45 వేల కోట్లు సీజ్‌ చేసింది.. ఫలితంగారాష్ట్రాన్ని తాకట్టుబెట్టి ఢల్లీిలో మోకరిల్లుతున్నావు. ప్రత్యేక హోదాలేదు, ప్యాకేజీ లేదు, పోలవరం లేదు, పట్టిసీమ లేదు, స్టీల్‌ఫ్లాంట్‌ లేదు, అభివృద్ధి లేదు ఏంటి నువ్వు సాధించింది.. కేవలం వందల కేసులు పెడుతున్నావు అన్నారు. 


అధికారుల విషయంలో తగ్దేదేలే..!


సీఐడీ అధికారులకు మూల్యం తప్పదు.. ప్రతీ ఒక్కరినీ కౌంట్‌ చేస్తున్నాం.. ఏ అధికారి ఎలా ప్రవర్తిస్తున్నారో లెక్కపెడుతున్నాం.. ప్రతిపక్షాలను అణుస్తున్నారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే వేటు వేస్తాం.. మీ అంతు చూస్తాం. తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన వెంటనే.. వారి సంగతి చూస్తామని ఇందులో ఏమాత్రం తగ్గేదేలే అంటూ డైలాగులు పేల్చారు. ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకోవాలి.. తెలంగాణా మంత్రి హరీష్‌ రావు ఏమన్నారు..ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెడుతున్నావు.. నీ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నావు అని బుచ్చయ్య అన్నారు.