MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోనే ట్రైన్ దిగిపోయిన ఎంపీ

ABP Desam Updated at: 04 Jul 2022 05:33 AM (IST)
Edited By: Satyaprasad Bandaru

MP Raghurama Krishna Raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నారు. లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఆయన మార్గమధ్యలో ట్రైన్ దిగి, తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు

NEXT PREV

MP Raghurama Krishna Raju :వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటనను విరమించుకున్నారు.  భీమవరం వచ్చేందుకు బయలుదేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్యలోనే ట్రైన్ దిగిపోయారు. అనూహ్యంగా భీమవరం పర్యటన రూట్ మార్చారు ఎంపీ రఘురామ. హైదరాబాద్ లింగంపల్లిలో రైలు ఎక్కిన ఎంపీ రఘురామకృష్ణరాజు బృందం బేగంపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగిపోయారు. నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న రఘురామకృష్ణరాజును కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు అనుసరిస్తున్నట్లు సమాచారం. ఎంపీని అనుసరిస్తున్న కొంతమంది నేతలపై ఇప్పటికే కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. రఘురామరాజుకు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తాను బేగంపేట రైల్వే స్టేషన్ లో దిగిపోయినట్లు రఘురామకృష్ణరాజు బృందం తెలిపింది. ఎంపీ హైదరాబాద్ లో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.  



అక్రమంగా నిర్బంధించారు 


'నేను నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో ఉన్నాను. భీమవరం బయలుదేరాను. నేను రైల్వే స్టేషన్ కు వచ్చే లోపు నాకు కావాల్సిన వారందరినీ అరెస్టు చేశారు. ఇప్పటి వరకూ 50 మందిని అరెస్టుచేసినట్లు తెలుస్తోంది. చాలా మందిని పోలీస్ స్టేషన్ లో కూర్చొపెట్టారు. కొంత మందిని కొడుతున్నారు. ఉన్మాదంగా ప్రవర్తిస్తు్న్నారు. రఘురామకృష్ణరాజుతో మీరు మాట్లాడండి. ఆయన భీమవరం వస్తే మీరు ఇబ్బంది పడతారు అని పిల్లల్ని, వారి తల్లిదండ్రులను వేధిస్తు్న్నారు. వారంతా నాకు ఫోన్లు చేస్తు్న్నారు. ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుంది. నా ప్రయాణం మానుకుంటే వారిని వదిలేస్తామంటున్నారు.' - ఎంపీ రఘురామ కృష్ణరాజు



 ప్రయాణం విరమించుకుంటున్నాను



రెండు రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తున్నాం. హెలికాఫ్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చిన వాళ్లను బెదిరించి లేఖ వెనక్కి తీసుకున్నారు. చివరకు కోర్టు తీర్పును కూడా అపహాస్యం చేస్తున్నారు. నా పర్యటనకు మద్దతు తెలిపిన వాళ్లను కొట్టించి వారిని స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారు. డీఐజీ ఫౌల్ రాజు గారు అంటా కోర్టు ఆదేశాల ప్రకారం ఎంపీకి మాత్రమే భద్రత ఇస్తామని, మిగిలిన వారితో సంబంధంలేదన్నారు అంట. ఎంపీ ప్రొటోకాల్ ప్రకారం తన నియోజకవర్గంలో ఉండడా అది జిల్లా యాంత్రానికి తెలియదా?. కేంద్రం సహకరించినప్పటికీ ప్రయాణం కదరడంలేదు. నా శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోరి నా ప్రయాణాన్ని మధ్యలోనే విమరించుకుంటున్నాను. పోరాడదాం. అక్కడి నుంచే పోరాడక్కర్లేదు. ఈ ప్రభుత్వం పాలన పోయేదాక పోరాడదాం.- - ఎంపీ రఘురామకృష్ణరాజు 

Published at: 03 Jul 2022 11:46 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.