IndiGo flights Delay : ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి. దీంతో సగానికి పైగా ఇండిగో సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల అంతరాయం ఏర్పాడింది. ఇండిగో విమానాల్లో 45 శాతం మాత్రమే శనివారం సమయానికి నడపగలిగాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండిగో సిబ్బంది అనారోగ్యంతో సెలవు తీసుకుని ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు వెళ్లారని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది. "ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. దీంతో సిక్ లీవ్ పేరుతో ఇండిగో క్యాబిన్ సిబ్బంది చాలా మంది ఆ డ్రైవ్ కు హాజరయ్యారు" అని ఓ అధికారి తెలిపారు.  




ట్వీట్లకు రిప్లై 


ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాల ఆలస్యంపై ఇండిగో నుంచి వివరణ కోరింది. ఆలస్యానికి గల కారణాలపై ఇండిగో ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. అయితే హోల్డ్ ఆఫ్ గురించి ఫిర్యాదు చేసిన పలువురు ప్రయాణికుల ట్వీట్లకు స్పందించింది. 




అసలేం జరిగింది? 


ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో అనూహ్య ఘటన జరిగింది. ఈ సంస్థకు చెందిన సిబ్బందిలో సగం మందికి పైగా ఒకేరోజు సిక్‌లీవ్‌ పెట్టారు. దీంతో ఇండిగో విమాన సర్వీసులకు తీవ్రం అంతరాయం కలిగింది. వీటితో పాటు అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. శనివారం ఒక్కరోజే దాదాపు 900 సర్వీసులపై ఈ ప్రభావం పడినట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది. అయితే సిక్‌లీవ్‌ పెట్టిన సిబ్బంది అంతా ఎయిర్‌ ఇండియా నిర్వహిస్తోన్న రిక్రూట్మెంట్ డ్రైమ్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇండిగో నిత్యం దాదాపు 1600 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడుపుతోంది. వీటిల్లో శనివారం కేవలం 45.2 శాతం సర్వీసులు మాత్రమే నడిచినట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆదివారం కూడా ఈ విధమైన సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. శనివారం ఎయిర్‌ ఇండియా (77%), స్పైస్‌ జెట్‌ (80.4%), విస్తారా (86.3%), గో ఫస్ట్‌ (88%), ఎయిర్‌ ఏసియా (92.3%) సంస్థలు తమ సర్వీసులను నడిపాయి.