KA Paul : చంద్రబాబు, జగన్, పవన్ కన్నా ప్రజల‌ సపోర్ట్ తనకే ఎక్కువ ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన మరోసారి పవన్ కు ఆఫర్ ఇచ్చారు. ప్రజలు తననే ముఖ్యమంత్రి  కావాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ సీఎం ‌కేసీఆర్, ఏపీలో సీఎం జగన్ కలిసి పయనిస్తే అభివృద్ధి ఉండేదని, కానీ కలిసి నడవడానికి వారు ససేమిరా అంటున్నారన్నారు. తెలంగాణలో తనపై దాడి జరగడంతో  రాజకీయ చిత్రం మారిపోయిందన్నారు. ఒక్క దెబ్బతో 30 లక్షల ఓటర్లు ప్రజాశాంతి పార్టీ వైపు వచ్చారన్నారు.  దేశంలో  శ్రీలంక పరిస్థితులు రాక ముందే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.  తెలంగాణలో కేసీఆర్ ను చిత్తుగా ఓడించాలన్నారు. తాను తెలంగాణ నుంచి పోటీ‌చేస్తానన్నారు.  


జగన్ కు సపోర్ట్ చేయను 


"జగన్ కు నేను జీవితంలో సపోర్ట్ చేయను. కేసీఆర్ కు కళ్లు నెత్తి మీదకు వచ్చాయి. కాబోయే తెలంగాణ సీఎం నేనే. స్పెషల్ ప్యాకేజ్, స్టేటస్ కేంద్రం ఏపీకి  ఇవ్వడం లేదు. నేనే ప్రధాని అయితే తెలుగు రాష్ట్రాలకు మహర్థశ వచ్చేది. జగన్ మూడు సంవత్సరాలలో‌ అప్పులు మాత్రమే చేశారు.  తమ్ముడు పవన్  నాతో  కలిస్తే  ముఖ్యమంత్రిని చేస్తాను. బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలంటే  నా పార్టీని  గెలిపించాలి." - కేఏ పాల్ 


పవన్ బీజేపీని వదిలిపెట్టాలి 


ఏపీలో అవినీతి ఆకాశాన్నంటుతుందని కేఏ పాల్ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన ఆయన ఎన్జీవో కల్యాణ మండపంలో ప్రజాశాంతి పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పాలన పోవాలన్నారు. తనతో కలిసి రావాలని వివిధ పార్టీలకు విజ్ఞప్తి చేసిన ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనంలా రాష్ట్రంలోనూ పాలన మారబోతుందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. మోదీ స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీని వదిలి పెట్టి తనతో కలిసి రావాలని పిలునిచ్చారు. జగన్ మూడేళ్ల పాలనలో చేసిందేమీ లేదని ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం మిగిలిందన్నారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 


Also Read : Amabati On Chandrababu : పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు బురద రాజకీయం, పరామర్శల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం- మంత్రి అంబటి రాంబాబు