జనసేన పార్టీ ( Janasena ) ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. మార్చి పధ్నాలుగో తేదీన మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 14న జరిగే సభకు ( anasena Aavirbhava Sabha ) అనుమతి కోసం గత నెల 28వ తేదీన పర్మిషన్ ఇవ్వాలని దరఖాస్తు చేశారు. కానీ పోలీసుల నుంచి స్పందన లేదని నాదెండ్ల మనోహర్ ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించారు. సహకరించాలని డీజీపీ కోరినా సహకరించడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ( Nadendal Manohar ) మండిపడ్డారు. సమయం దగ్గర పడుతూండటంతో జనసేన సభ నిర్వహణపై పర్మిషన్ ఇవ్వాలంటూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. అయితే కాసేపటికే పోలీసుల నుంచి పర్మిషన్ ఇస్తున్నట్లుగా సమాచారం వచ్చింది.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయలకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన సీఎం జగన్
జనసేన ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 12 కమిటీలు ఏర్పాటు చేసి సభా సన్నాహాలు చేస్తున్నారు. స్థానికంగా, దూర ప్రాంతాల నుంచి వచ్చే జనసేన శ్రేణులు, నాయకులు, వీరమహిళలు, జనసేన అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. మార్చి 14న ( March 14 ) జరిగే ఆవిర్భావ సభలో భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటిస్తానని పవన్ ( Pawan Kalyan ) ఇప్పటికే ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు ఆవిర్భావ సభను నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఘనంగా నిర్వహంచారు.ఆ సందర్భంగా తన కార్యాచరణను పవన్ కల్యాణ్ ప్రకటించారు. అదే స్టైల్లో పవన్ తన పార్టీ ప్రాధాన్యాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ తమకు తెలుసని.. వాటికి పరిష్కారం చూపించే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని జనసేన వర్గాలుచెబుతున్నాయి.
జగన్‌పై ఓడిపోయేంత వ్యతిరేకత లేదు - టీడీపీ నేత జేసీ కీలక వ్యాఖ్యలు!
గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో జత కట్టి ఎన్నికలకు వెళ్లిన పవన్ ఎదురుదెబ్బ తిన్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇరప్పుడు బీజేపీతో ఆయన దూరం జరుగుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు ఏ మాత్రం ఉపయోగం లేకపోగా.., మరింత నష్టమని ఆ పార్టీ నేతలు ఇప్పటికే పవన్‌కు చెబుతూ వస్తున్నారు. ఈ విషయంపైనా పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.