JC Diwakar : జగన్‌పై ఓడిపోయేంత వ్యతిరేకత లేదు - టీడీపీ నేత జేసీ కీలక వ్యాఖ్యలు!

ఏపీలో జగన్‌కు క్రేజ్ తగ్గింది కానీ అది ఓడిపోయేంత కాదని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎల్పీకి వచ్చిన ఆయన ఇంకా ఏమన్నారంటే..?

Continues below advertisement


 

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ( CM Jagan ) ప్రజల్లో క్రేజ్ కాస్తంత తగ్గవచ్చుకానీ ఓడిపోయేంత తగ్గలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశ్లేషించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ( Chandra Babu )  వద్ద అంతా భజన బ్యాచ్ చేరిందని ఆయన విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ( TS Assembly ) సమావేశాలు ఎప్పుడు జరిగినా ఆయన సీఎల్పీకి వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేస్తూంటారు. అలాగే బుధవారం కూడా జేసీ అసెంబ్లీకి వచ్చారు. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగాఏపీ రాజకీయాలపై కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ( AP Capital () అంశంలో జగన్ మూడు రాజధాలను వదిలేసినట్లేనని..అందుకే బొత్స హైదరాబాద్ మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. మంత్రి బొత్స మళ్లీ హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారని.. తమకు ఇంకా రెండేళ్లు హైదరాబాద్‌లో ( Hyderabad ) ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.అక్కడ ఉండొచ్చు.. ఇక్కడ ఉండొచ్చని.. కేంద్రం చెప్పినట్లు ఏపీకి ఆ ( Andhra ) అవకాశం ఉందన్నారు జేసీ దివాకర్ రెడ్డి. హైదరాబాద్‌లో ఏపీకి కూడా రెండేళ్లు హక్కు ఉందని.. మహా, మహా మేధావులు కలిసి మూడు రాజధానులు పెట్టారన్నారు. ఒకటి కాదు పది రాజధానులు పెట్టుకోని.. అది 'మా' సీఎం జగన్ ఇష్టం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీలో ఉన్న సమయంలోనే కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడంపై ఆయన స్పందించారు. ఒకేసారి ఇన్ని ఉద్యోగాల ప్రకటన ఏనాడూ లేదని... కేసీఆర్ కు ( KCR ) యువత నుంచి సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన మొనగాడు లేడని ప్రశంసించారు. ఇటీవల ముఖ్యమంత్రుల్ని కలవడం కష్టమపోతోందని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందట కేసీఆర్ అపాయింట్‌మెంట్ లేకుండా ఆయన ప్రగతి భవన్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ వెళ్లనీయకపోవడంతో నిరాశతో వెళ్లిపోయారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గతంలోలా ముఖ్యమంత్రుల్ని కలిసే పరిస్థితి లేదని నిరాశవ్యక్తం చేశారు. 

ఏపీలో అయితే.. మంత్రులకే అపాయింట్ మెంట్ దొరకడం లేదన్నారు.  ఏపీ రాష్ట్రంలో జీతాలకే డబ్బులు లేవని .. తెలంగాణ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయడం సాధ్యం కాకపోవచ్చన్నారు.  రావొచ్చన్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయకుండా తన కుమారుడ్నిరంగంలోకి దింపిన జేసీ.. తర్వాత దాదాపుగా సైలెంటయ్యారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola