ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఏపీ అసెంబ్లీలో సంతాపం చెప్పలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించారు.రెండో రోజు మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి  సంతాపం తెలిపారు.  వెంటనే సభను వాయిదా వేశారు. రెండో రోజు ఈ ఒక్క అంశమే సభ ఎజెండాలో ఉంది.  అయితే  ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు సంతాపం తెలియచేయకపోవడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 


"న్యాయవ్యవస్థ పరిమితులపై చర్చ" ఇప్పటికి లేనట్లే ! ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసిందా ?


 ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్య గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో కన్ను మూశారు. ఈ  సందర్భంగా ఆయనను తెలుగు రాష్ట్రాలప్రజలు, నేతలు అందరూ గుర్తు చేసుకున్నారు. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సేవలు అందించారు. మంత్రిగా సుదీర్గ కాలం పని చేశారు. అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశ పెట్టినఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల కారణంగా వైదొలిగారు. తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు.  


దమ్ముంటే రాజీనామా చేసి రా ! అచ్చెన్న, రోజా సవాళ్ల హీట్ !


వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన రోశయ్య చనిపోయినప్పుడు సీఎం జగన్  సంతాపం ప్రకటించారు. కానీ  నివాళి అర్పించేందుకు వెళ్లలేదు. అప్పుడే రాజకీయ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆయనకు అసెంబ్లీ ద్వారా సంతాపం తెలుపకుండా అవమానించారన్న విమర్శలను 
టీడీపీ నేతలుచేస్తున్నారు.  రోశయ్య పట్ల సీఎం జగన్ కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారని.. గతంలో తనను కాకుండా రోశయ్యను సీఎం చేశారన్న ఆగ్రహంతో జగన్ ఉన్నారని అంటున్నారు.  



సాధారణంగా ఎవరైనా సభ్యులు, మాజీ సభ్యులు చనిపోతే సభలోసంతాపం చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. అయితే సిట్టింగ్ సభ్యులు చనిపోయినప్పుడు ఆయన ఒక్కరికే సంతాపం తెలిపి సభను వాయిదా వేయడం సంప్రదాయంగా వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రోజుల్లో మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలను ఆమోదిస్తారని చెబుతున్నారు. రోశయ్యకు తర్వాత సభ జరిగే రోజుల్లో సంతాపం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై టీడీపీ తో పాటు కొన్ని ఆర్యవైశ్య సంఘాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించాయి.