ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణంపై తెలుగు రాష్ట్రాల ప్రజందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏం జరిగింది ? ఎలా జరిగిందనేది ? ప్రతి ఒక్కరి మదిని తొలుస్తోంది.  హైదరాబాద్ ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు ( Heart Attack ) రావడంతోనే ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన వెంట ఉన్నది ఆయన డ్రైవర్ నాగేశ్వరరావు ( Mekapati Driver )  ఒక్కరే. ఆయనతో "ఏబీపీ దేశం" తో ( ABP Desam )ప్రత్యేకంగా సంభాషించింది. ఆయన మంత్రి ప్రాణాలు కాపాడేందుకు ఎంత తపన పడ్డారో..  మంత్రి మేకపాటి చివరి క్షణాల్లో ఎంత వేదన అనుభవించారో ఆయన కళ్లకు కట్టినట్లుగా వివరించారు.


సంపూర్ణ ఆరోగ్యం - క్రమం తప్పని వ్యాయామం ! అయినా ఎందుకిలా ? 


ప్రతీ రోజూ ఏడు గంటలకు రెడీ అయి జిమ్ కు వెళ్లడం గౌతంరెడ్డికి అలవాటు. హైదరాబాద్‌లో ( Hyderabad ) ఉన్న సమయంలో డ్రైవర్ ఏడు గంటల కల్లా జమ్‌కు తీసుకెళ్లి రెడీ అవుతారు. అలాగే సోమవారం కూడా నాగేశ్వరరావు మంత్రి గౌతంరెడ్డిని జిమ్‌కు తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నారు. ఎదురు చూస్తున్న సమయంలో తనను ఏడు గంటల పది నిమిషాలకు మంత్రి పైకి పిలిచారన్నారు. పైకి వెళ్లే సరికి గౌతం రెడ్డి సోఫాలో పక్కకు వాలిపోయి ఉన్నారు. అయితే కొద్దిగా మాట్లాడుతున్నారు. 


పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, 'భీమ్లానాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్


చెమటలు పడుతున్న శరీరంతో కొద్ది కొద్దిగా మాటలు సవరించుకుని మంచి నీళ్లు తీసుకురమ్మని డ్రైవర్ నాగేశ్వరరావుని అడిగారు . వెంటనే తెచ్చి ఇచ్చినప్పటికీ గౌతంరెడ్డి తాగే పరిస్థితిలో లేరు. దీంతో ప్రమాదాన్ని శంకించిన నాగేశ్వరరావు వెంటనే ఇతరులను పిలిచి కారులో సమీపంలో ఉన్న అపోలో ( Apollo Hospital ) ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎంత త్వరగా తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని డ్రైవర్ నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమవుతున్నారు. మంత్రికి ఏమైనా అవయవాలు అవసరం అయితే తనవి తీసుకుని బతికించాలని డాక్టర్లను వేడుకున్నానని ఆయన ఆవేదనా స్వరంతో చెబుతున్నారు. 


మంత్రి మేకపాటి దగ్గర పని చేస్తున్న డ్రైవర్ ఆయన ఎంత మంచివాడో చెప్పేందుకు ఎన్నో  ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు. ఓసారి డ్రైవింగ్ లో నాకు కళ్ళు సరిగ్గా కలిపించకపోతే .. ఆయన కళ్ళజోడు తీసి ఇచ్చారని గుర్తు చేసింది. కారు పంచర్ పడితే ..ఆయన దిగి టైర్ మార్చేవారన్నారు. ఎలాంటి భేషజాలకు పోరని.. గొప్ప వ్యక్తిని కోల్పోయామమని ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు.