ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ గట్టి షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మరీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున  భారీ జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా రూ. 120 కోట్లను జరిమానాగా విధించారు.  పురుషోత్తమ పట్నంకు రూ. 24.56  కోట్లు,  పట్టిసీమ ప్రాజెక్టుకు 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ. 73.6 కోట్లు జరిగిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఎన్టీటీ ఆదేశించింది. వీటిని ఎలా వినియోగించాలో ఏపీ పీసీబీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్టీటీ ఆదేశించింది. 


Also Read : వివేకా హత్య కేసులో కీలక మలుపు .. హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ !


పురుషోత్తమపట్నం, పట్టిసీమ, చింతలపూడి మూడు పోలవరంలో భాగమైన ప్రాజెక్టులని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. పోలవరం పూర్తవడానికి ముందే నీటిని పోలవరం కాలువల ద్వారా పంపించడానికి నిర్మించిన ప్రాజెక్టులు. అయితే వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఎన్జీటీలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.   ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిపై విచారణ జరుపుతోంది. ఈ మూడు ప్రాజెక్టులు అక్రమం అని గతంలోనే ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఈ మూడు ప్రాజెక్టులు పోలవరంలో భాగంకాదని కేంద్రజలశక్తి శాఖ ఎన్జీటీకి చెప్పింది. దీంతో పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. 


Also Read : వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం


అయితే పురుషోత్తమ పట్నం ఒక్కటే నిర్మాణంలో ఉంది. పట్టిసీమ,చింతలపూడి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే నిర్వహణలో ఉన్నందున పర్యావరణ అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ సూచించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని...  జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. 


Also Read: ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !


పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినందుకు గాను జరిమానా, పరిహారం అంచనాపై కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లతో పాటు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది.ఆ కమిటీ చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పరిశీలించింది. చివరికి జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 


Also Read: "సంపూర్ణ గృహహక్కు" తో పేద ప్రజలకు లక్షల ఆస్తి .. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే ! ఓటీఎస్‌ పథకంపై పూర్తి డీటైల్స్ ఇవిగో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి