గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న దుగ్గిరాల మండల అధ్యక్ష ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్నిక వాయిదా వేయాలన్న తెలుగుదేశం ఎంపీపీ అభ్యర్థి షేక్‌ జబీన్‌ వినతిని పరిశీలించిన హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జబీన్‌ కుల ధ్రవీకరణ పత్రంపై వారం  రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.


Also Read : "దుర్గమ్మ గుడి మొత్తం వైఎస్ఆర్‌సీపీ రంగుల లైట్లు..." నిజం కాదు ! ఫేక్ !


మండల అధ్యక్ష పదవుల ఎన్నికలు అన్ని చోట్లా పూర్తయ్యాయి కానీ  దుగ్గిరాల మండలంలో మాత్రం పూర్తి కాలేదు. అక్కడ మండల అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీతో పాటు తెలుగుదేశం నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు.  దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తెలుగుదేశం 9, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి. జనసేన మద్దతుతో దుగ్గిరాల మండలాధ్యక్ష స్థానాన్ని గెలుచుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 


Also Read : ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ తేదీలోగా ఆప్షన్లు ఇవ్వండి


దుగ్గిరాల ఎంపీపీ స్థానం బీసీలకు రిజర్వ్ అయింది. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వారిలో బీసీ వర్గానికి చెందిన ఎంపీటీసీ ఒక్కరే ఉన్నారు. అయితే షేక్‌ జబీన్‌ అనే ఆ ఎంపీటీసీకి క్యాస్ట్ సర్టిఫికెట్‌ను అధికారులు మంజూరు చేయడం లేదు. ఓ సారి ఎమ్మార్వో తిరస్కరించారు. క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయకుండా కుట్ర చేసి దుగ్గిరాల ఎపీపీ స్థానాన్ని వైసీపీ గెల్చుకోవాలనుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చే వరకూ తాము సమావేశానికి హాజరు కాబోమని టీడీపీ ఎంపీటీసీలు ప్రకటించారు. దీంతో  ఎంపీపీ ఎన్నిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. 


Also Read : సమస్యలు పరిష్కరించకపోతే పోరు బాట.. ఏపీ ప్రభుత్వానికి రెండు ఉద్యోగ సంఘాల హెచ్చరిక !


ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. మూడో సారి శుక్రవారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పటికీ టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దుగ్గిరాల మండల పరిషత్‌ పీఠం వైఎస్ఆర్‌సీపీ గెల్చుకుంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలోనే మీడియా ఎదుట శపథం చేశారు. ఎంపీపీ ఎన్నిక జరగాలంటే కనీసం 9 మంది ఎంపీటీసీలు హాజరుకావాల్సి ఉంటుంది. 


Also Read : "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి