East Godavari News : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం గ్రామం(K.Gangavaram Village)లో రామాలయం వద్ద క్రైస్తవ కూటం(Christian Prayers) ఏర్పాటు చేసి ప్రార్థనలు నిర్వహించారని సామాజిక మాధ్యమాల్లో(Social Media) వీడియోలు వైరల్(Viral Video) అవుతున్నాయి. ఈ వీడియోలో రామాలయం ముందు క్రైస్తవ ప్రార్థనలు జరుగుతుండగా స్థానిక వ్యక్తి అడ్డుకున్నాడు. రామాలయం(Ramalayam) ముందు క్రైస్తవ ప్రార్థనలు ఏంటని ప్రశ్నించాడు. రామాలయానికి ఆనుకుని ఉన్న ఇంటి వద్ద క్రైస్తవ కూటం ఏర్పాటు చేసుకున్నామని, రామాలయం వద్ద కాదని చెబుతున్న మరో వర్గం చెబుతుంది. రామాలయం వద్ద ప్రార్థనలు పెట్టొదంటే తమపై దిశ యాప్ లో తప్పుడు ఫిర్యాదులు చేసి కేసులు పెట్టారని స్థానిక వ్యక్తి ఆరోపిస్తున్నారు. బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ ట్విట్టర్(Twitter) లో ఈ వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాస్తవాలు వెలికితీసేందుకు ప్రయత్నించారు.
పోలీసులు ఏం చెబుతున్నారంటే?
పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.గంగవరం గ్రామంలో “రామాలయంలో ఏసు ప్రార్థనలు పెట్టారని” సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అంటున్నారు. ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎమ్.రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ గంగవరం గ్రామంలో “కాదా మంగాయమ్మ” అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ప్రార్ధనలు నిర్వహిస్తున్నారని, అదే రోడ్డుకి ఆనుకుని ఉన్న రామాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయని ఈ విషయంలో స్థానిక హిందువులకు, క్రైస్తవులకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఇటీవల మంగాయమ్మకు, కాకినాడలో ఉంటున్న ఆమె పెద్ద కుమారుడైన కాదా శ్రీనివాస్ తో ఆర్ధిక వివాదాలు తలెత్తాయి. తన తల్లి ప్రార్థనల పేరుతో డబ్బు వృధా చేస్తుందని ఘర్షణ పడుతున్నారు. ఈ విషయంలో మంగాయమ్మ, మరికొందరు డయల్ 100 కు ఫోన్ చేయగా పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లి తల్లి కొడుకులకు సర్ది చెప్పారు.
ఎలాంటి కేసులు నమోదు పెట్టలేదు
ఈ విషయమై కాదా శ్రీనివాస్ కు వరసకు సోదరుడైన అదే గ్రామంలో ఉంటున్న కాదా వెంకట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో “రామాలయంలో ప్రార్ధనలు ఏ విధంగా పెడతారు” అని ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఈ విషయం లో ఎవరిపైనా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ఎమ్.రవీంద్రనాథ్ బాబు తెలియజేశారు.