మంత్రి గారు వస్తున్నారంటే ఆలయ అధికారులకు కన్నూమిన్నూ కనిపించలేదు. ఇక భక్తులెక్కడ కనిపిస్తారు. వారి మానాన వారిని వదిలేసి మంత్రిని ( AP Minister )  సేవించడంలో మునిగిపోయారు . మంత్రిగారు కూడా రాక రాక మంత్రి పదవి వచ్చింది..గతంలో ఎప్పుడు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు...ఇప్పుడు మాత్రం రెడ్ కార్పెట్ ( Red Carpet ) వేస్తున్నారని సంబరపడిపోయి..  ఆయన కూడా వారి సేవల్ని తదాత్మ్యకంగా పొందడంలో నిమగ్నమయ్యారు. కానీ ఒక్క సారిగా భక్తులు గో బ్యాక్ మినిస్టర్ ( Go Back Minister ) అని నినాదాలు చేయడంతో ఉలిక్కిపడి తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నారు.ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో చోటు చేసుకుంది.


స్వామీ ఏంటి ఈ పని? వెంకన్న సాక్షిగా మళ్లీ నిబంధనల ఉల్లంఘన!


ఏపీ కొత్త దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ( Minister Kottu Satyanarayana ) ఆలయాల సందర్శనకు బయలుదేరారు. ఇవాళ శ్రీకాళహస్తి ( Sri Kalahasti ) వెళ్లారు. ఆయన వస్తున్నారని అధికారులు హడావుడి చేశారు. క్యూలైన్లు నిలిపివేశారు. అరగంటో..గంటో అలా నిలిపివేస్తే భక్తులు సర్దుకునేవారేమో . మంత్రి గారు రావడానికి చాలా సేపటి ముందే దర్శనాలు నిలిపివేశారు.  క్యూలో నిలుచున్న భక్తులను ( Devotees )  గంటల తరబడి నిలిపివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పూజలు చేసి వెళ్తుండగా మినిస్టర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఆలయ అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.  


అమ్మఒడి లబ్ధిదారులకు షాక్‌- జిల్లా మార్చుకోకుంటే డబ్బులు రానట్టే!
  
కనీసం తాగడానికి నీరు ( Water ) కూడా కల్పించకుండా, దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.. దేవాదాయ శాఖ మంత్రి వారి వద్దకు వెళ్లి వాళ్లను సముదాయించి  భక్తులకు దర్శన ఏర్పాట్లు కల్పించారు.. గంటలకొద్దీ భక్తులు వేచి ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది . దీంతో ఒక్కసారిగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎక్కువ మంది శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వస్తూంటారు. రాహు కేతు పూజల కోసం ప్రత్యేకంగా భక్తులు తరలి వస్తూంటారు. ఈ కారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అయినా మంత్రి కోసం అన్నింటినీ నిలిపివేయడంతో భక్తుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది.