ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగాయి. కొవిడ్ మరణాలు సైతం పెరగడం ఆందోళన పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,361 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 15 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,21,708 పాజిటివ్ కేసులకు గాను 19,93,248 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు.


ఏపీలో ఇప్పటివరకూ 13,950 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,510 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాడు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో కొత్త వేరియంట్ ఏవై 12 కేసులు సైతం తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. 


Also Read: Nipah Virus: నిఫా- కరోనా ఒకేసారి వస్తే? ఈ వైరస్ గురించి షాకింగ్ విషయాలివే 






గడిచిన 24 గంటల్లో 1,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. కొవిడ్ బారిన పడి కృష్ణా జిల్లాలో ముగ్గురు.. నెల్లూరులో ముగ్గురు చనిపోగా, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 70 లక్షల 99 వేల 014 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు.


Also Read: Miracle Tree Moringa: అందానికి, ఆరోగ్యానికి.. గుప్పెడు మునగాకులు


ఏపీలో నమూనా పరీక్షల సంఖ్య : 61,363 
కోవిడ్19 పాజిటివ్ కేసులు: 1,361
తాజా మరణాలు : 15
అత్యధిక కేసులు:  నెల్లూరు జిల్లాలో 282 పాజిటివ్ కేసులు, చిత్తూరు జిల్లాలో 203 కేసులు
కరోనా యాక్టివ్ కేసులు : 14,510
గడిచిన 24 గంటల్లో రికవరీల సంఖ్య :  1,288


ఏపీలో జిల్లాలవారీగా చూస్తే నెల్లూరులో అత్యధికంగా 282 కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి 143, పశ్చిమ గోదావరి జిల్లాలో 149... అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 25, విజయనగరంలో 26 మంది కరోనా బారిన పడ్డారు.


Also Read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం