సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన అనంతరం ఏపీలో గత రెండు నెలలుగా వెయ్యి, లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,184 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 11 మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉన్నా.. కేసులు మాత్రం తగ్గడం లేదని రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 20,43,946 కు గాను నేటి ఉదయం వరకు 20,16,762 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో యాక్టివ్ కేసులు 14 వేలకు పైగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 14,136 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: చర్మం మెరిసేందుకు విటమిన్ ఎ కావాల్సిందే... మీ ఆహారంలో విటమిన్ ఎ ఉందా?
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికం..
కేసులవారీగా చూస్తే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 218 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరులో 165, గుంటూరులో 150, నెల్లూరులో 138, పశ్చిమ గోదావరిలో 126, కృష్ణాలో 116, ప్రకాశంలో 114 మందికి కరోనా సోకింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడగా.. అనంతపురం 13, విజయనగరం 20, శ్రీకాకుళం 27 కేసులతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
Watch: పలాస, టెక్కలి మధ్య తీరం దాటనున్న గులాబ్ తుపాను.. ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ మంత్రి
భారీ సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు.. వ్యాక్సినేషన్ వేగవంతం..
నిన్న ఒక్కరోజులో ఏపీలో చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 కరోనాతో చనిపోయారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,136కు చేరింది. గడిచిన 24 గంటల్లో 58,545 శాంపిల్స్‌కు కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం ఏపీలో జోరుగా కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహిస్తూనే, వ్యాక్సినేషన్ వేగంగా జరిపేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.