Jobs For 1998 DSC Candidates :    1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగాలివ్వాలని నిర్ణయించుకుంది. అప్పట్లో అర్హత సాధించిన వారిలో చాలా మందికి ఉద్యోగాలు వివిధ కారణాలతో ఇవ్వలేదు. 24 ఏళ్లుగా వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి వారికి ఉద్యోగాలిచ్చే ఫైల్‌పై ఏపీ సీఎం జగన్సంతకం చేశారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగం ఇచే దిశగా ప్ర‌భుత్వం విధివిధానాలను సిద్ధం చేయనుంది.  గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 1998, 2008 డీఎస్సీ అర్హుల‌ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు.  4,565 మందికి ఇప్పుడు ల‌బ్ధిచేకూరే అవకాశం ఉంది.  త్వరలోనే మార్గ‌ద‌ర్శ‌కాలు వస్తాయని, విధివిధానాలను అధికారులు ప్రకటించనున్నారు. 


ఒక్క రోజులోనే ధియేటర్ల ఖాతాలో కలెక్షన్స్ - ఆన్‌లైన్‌పై ఎగ్జిబిటర్లకు అపోహలొద్దంటున్న ఏపీ ప్రభుత్వం !


అయితే డీఎస్సీ రాసి ఇప్పటికే 24 ఏళ్లు దాటింది. అంటే అభ్యర్థులు పాతికేళ్లకే పరీక్షలు రాసినా యాభై ఏళ్లు వస్తాయి. రిజర్వేషన్ మినహాయింపులతో ముఫ్పై ఏళ్లకు పరీక్షలు రాసిన వారు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి ఉంటారు. అర్హుల్లో ఎంత మంది ఇతర ఉద్యోగాల్లో స్థిరపడకుండా ఉంటారన్నది స్పష్టత లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ డీఎస్సీలో అర్హులైన వారికి ఏదో విధంగా న్యాయం చేయాలని అనుకుంటోంది. 


మరోసారి పోలవరానికి కేంద్ర నిపుణుల కమిటీ - ఈ సారైనా క్లారిటీ క్లారిటీ ఇస్తారా ?


ఆంద్రప్రదేశ్‌లో  2008 డీఎస్సీ అభ్యర్థులు కూడా ఉద్యోగాలు పొందలేకపోయారు. వారికి కూడా ప్రభుత్వం  ఉద్యోగాలు కల్పించింది. 2008లో డీఎస్సీ క్వాలిఫై అయిన 2 వేల 193 మంది అభ్యర్ధులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి మినిమమ్ స్కేల్ వర్తింపజేస్తున్నట్టు తెలిపింది. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2008 అభ్యర్ధులకు న్యాయం జరిగింది  మానవతా దృక్పథంతో డీఎస్సీ అభ్యర్ధుల సమస్యను పరిష్కరించామని ప్రభుత్వం ప్రకటించింది.  


యూనిఫాంలో డ్యూటీకొచ్చిన ఏబీవీ - స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతల స్వీకారణ


2008  డీఎస్సీ అర్హులకు మినిమం టైం స్కేల్ ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఎంత మంది జాయినయ్యారన్నదానిపై స్పష్టత లేదు. ఎక్కువ మంది ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిపోయి ఉంటారు. ఇప్పుడు దాదాపుగా ఇరవై నాలుగేళ్ల కిందటి డీఎస్సీ అంటే.. దాదాపు ఎవరూ ఉండరని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మినిమం టైమ్ స్కేల్ ప్రకారం ఉద్యోగం ఇస్తామన్నా.. వారు చేరుతారా అన్నది సందేహమేనంటున్నారు.